BigTV English
Advertisement

Jr NTR’s Dragon : తారక్ పాత్రను లీక్ చేసిన ప్రశాంత్ నీల్… మరీ ఇంత వైల్డ్ ఏంటి గురూ..

Jr NTR’s Dragon : తారక్ పాత్రను లీక్ చేసిన ప్రశాంత్ నీల్… మరీ ఇంత వైల్డ్ ఏంటి గురూ..

Jr NTR’s Dragon : యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ (RRR ) సినిమా చేసి గ్లోబల్ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు హిందీలో ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. మరి వీరిద్దరి కలయికలో రాబోతున్న కథ ఏ జానర్ కి సంబంధించింది అనే విషయాలు తెలుసుకోవడానికి అభిమానుల సైతం ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో.. ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు.


ఎన్టీఆర్ ను సరికొత్తగా చూపించనున్న ప్రశాంత్ నీల్..

గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు మేకర్స్. టైటిల్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఈ సినిమాపై ఎన్నో గాసిప్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇది మైథలాజికల్ సబ్జెక్ట్ అని, ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ చాలా కొత్తగా ట్రై చేయబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ నీల్ స్పందిస్తూ..”ఇది మైథలాజికల్ మూవీ కాదు.. పీరియాడిక్ మూవీ” అంటూ తెలిపారు. వార్ 2 సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తెరపైకి రాబోతోంది. ముఖ్యంగా కేజిఎఫ్, సలార్ లోని ఖాన్ సార్ తరహాలోనే ఇందులో కూడా ఒక కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారట. ముఖ్యంగా యూరప్ లోని నల్ల సముద్రం దగ్గర #ఎన్టీఆర్31 సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇందులో మునుపెన్నడూ చూడని విధంగా, ఎన్టీఆర్ ను చాలా వైల్డ్ గా చూపించబోతున్నారట. మొత్తానికి అయితే ఎన్టీఆర్ తన వైల్డ్ లుక్ తో ఫ్యాన్స్ ఏ విధంగా మెప్పిస్తారో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా నటిస్తోంది.


ఎన్టీఆర్ కెరియర్..

స్వర్గీయ నందమూరి తారకరామారావు మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్, అతి తక్కువ సమయంలోనే తన నటనతో అందరిని అబ్బురపరిచారు. 1991లో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో బాల నటుడిగా భరతుడి క్యారెక్టర్ తో ప్రేక్షకులను మెప్పించిన ఎన్టీఆర్ 1996లో బాల రామాయణం సినిమాలో బాల రాముడిగా నటించారు ఇక తర్వాత 2001లో నిన్ను చూడాలని సినిమాతో హీరోగా మారిన ఎన్టీఆర్.. స్టూడెంట్ నెంబర్ వన్ సుబ్బు ఆది అల్లరి రాముడు ఇలా పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.

ఎన్టీఆర్ అందుకున్న పురస్కారాలు..

2016లో ఉత్తమ నటుడిగా సైమా అవార్డును సొంతం చేసుకున్నారు ముఖ్యంగా జనతా గ్యారేజ్ సినిమాలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో ఆయనకు ఎవడు లభించింది అలాగే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను కూడా ఉత్తమ నటుడు క్యాటగిరీలో 2022లో సైమా అవార్డు లభించింది అలా రెండు పురస్కారాలు అందుకున్నారు ఎన్టీఆర్ ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×