E-Paper
Advertisement

Rekha Vedavyas: ఆనందం బ్యూటీ.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి.. అస్సలు గుర్తుపట్టలేరు

Rekha Vedavyas: ఆనందం బ్యూటీ.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి.. అస్సలు గుర్తుపట్టలేరు
Advertisement

Rekha Vedavyas: రేఖ వేదవ్యాస్.. ఇప్పుడంటే ఈ పేరు వినగానే ఎవరు అంటున్నారు కానీ, ఒకప్పుడు అయితే అమ్మడు పేరు వినగానే.. ఎవరైనా ఎప్పుడైనా ఈ చిత్రం చూశారా అని పాట అందుకొనేవారు. అది లేకపోతే నువ్వు చూడు చూడకపో.. నేను చూస్తూనే ఉంటా అంటూ విరహ గీతం ఆలపించేవారు. ఈ టాప్ సాంగ్స్ లో నటించిన హీరోయినే రేఖ.

ఆనందం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఇండస్ట్రీలో ఎవరికైనా.. ఎన్నాళ్లు ఉన్నాం అన్నది కాదు.. ఒక్క సినిమా చేసినా ఎన్నేళ్ళైనా గుర్తుండిపోయే పాత్రలో నటించాలి అనుకుంటారు. అలాంటి పాత్రలు రేఖకు సొంతమయ్యాయి. ఆమె కెరీర్ లో ఆనందం, ఒకటో నంబర్ కుర్రాడు సినిమాలు ఎన్నేళ్లైనా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రను వేశాయి.

Advertisement

ఇక జానకి వెడ్స్ శ్రీరామ్‌, అనగనగా ఒక కుర్రాడు, జాబిలి, ప్రేమించుకుందాం.. పెళ్ళికి రండి లాంటి సినిమాల్లో నటించి మెప్పించిన రేఖ.. పెద్దగా సక్సెస్‌లు లేకపోవడంతో కన్నడకే పరిమితమయ్యింది. అక్కడే వరుసగా సినిమాలు చేసింది. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగులో అస్సలు ఒక్క సినిమాలో కూడా కనిపించింది లేదు. ఇక మధ్యమధ్యలో అలీతో సరదాగా, వావ్ లాంటి షోలలో మెరిసిన రెఝా.. అప్పుడు బానే ఉంది.. ఆరోగ్యంగానే ఉంది. అయితే దాదాపు 9 ఏళ్ల తరువాత శ్రీదేవి డ్రామా కంపెనీలో మెరిసింది. అమ్మడును చూసి అందరూ షాక్ అయ్యారు.

ఏంటి..? ఎవరీమె అని ఆశ్చర్యపోయారు. రేఖ ఏంటి ఇలా మారిపోయింది.. ? అసలు ఏమైంది అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. బక్కచిక్కిపోయి.. మంచి లుక్ పోయి పేషేంట్ లా కనిపించింది. తాను కొన్ని అనారోగ్య కారణాల వలన ఇలా జరిగిందని, అంతా అనుకోకుండా జరిగిందని తెలిపింది. ఒత్తిడిని ఎక్కువ దగ్గరకు రానివ్వకండి.. దానివలన ఎంతో సఫర్ అయ్యినట్లు ఆమె తెలిపింది.

Advertisement

నిజంగా ఆమెను చూసి అందరూ షాక్ అయ్యారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. అన్ని బావుంటే ఆమె కోలుకొని మళ్లీ రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ లు లేకపోలేదని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఆమె త్వరగా కోలుకొని మంచి సినిమాలతో అలరిస్తుందేమో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×