BigTV English
Advertisement

Ivanka Trump: ‘లవ్ యూ డాడ్’ అంటూ.. ఇవాంక ట్రంప్ భావోద్వేగ పోస్ట్‌

Ivanka Trump: ‘లవ్ యూ డాడ్’ అంటూ.. ఇవాంక ట్రంప్ భావోద్వేగ పోస్ట్‌

Ivanka Trump: స్మార్టీ డేనియల్‌తో అక్రమ సంబంధం కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ దోషిగా తేలిన విషయం తెలిసిందే.. అయితే స్టార్మీ డేనియల్‌కు డబ్బులు ఇచ్చిన కేసులో కోర్టు ట్రంప్‌ను దోషిగా తేల్చింది. ఈ కేసులో నమోదైన అన్ని ఆరోపణలు రుజువైనట్లు న్యూయార్క్ కోర్టు తెలిపింది. దాదాపు 34 అంశాల్లో ట్రంప్ దోషిగా కోర్టు నిర్ధారించింది.


ఈ నేపథ్యంలోనే ఆయన కుూతురు ఇవాంక ట్రంప్ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రితో ఉన్న చిన్ననాటి ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అంతే కాకుండా ఆ ఫోటోకు లవ్ యూ డాడ్ అంటూ హర్ట్ ఎమోజీతో క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా  మారింది.

పోర్న్ స్టార్ కు డబ్బులు ఇచ్చేందుకు ట్రంప్ బిజినెస్ రికార్డులను తారుమారు చేసినట్లు నేరాభియోగాలు నమోదయ్యాయి. మాజీ అటార్నీ మైఖేల్ కోహెన్ ద్వారా ట్రంప్ పోర్న్ స్టార్ ‌కు డబ్బులు చెల్లించారు. అయితే ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ట్రంప్ ఆయన ఖాతాలను కూడా మార్చేశారు. ఆ కేసుపై కొన్ని రోజుల నుంచి విచారణ కూడా జరిగింది. అయితే ఈ కేసులో దోషిగా తేలిన ట్రంప్ కు కోర్టు జూలై 11న శిక్ష ఖరారు చేయనుంది.


Also Read: శృంగార తారతో ట్రంప్‌ అక్రమ సంబంధం.. నిజమేనని తేల్చిన కోర్టు

ఈ ఏడాది జరగనున్న దేశ అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరపున ట్రంప్ పోటీ చేస్తున్నారు. జూలై 11న తుది తీర్పు వెలువడనుందని జడ్జ్ జువాన్ తెలిపారు. ఈ కేసులో ట్రంప్ కు జైలు శిక్ష లేదా జరిమానా పడే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మన్ హట్టన్ కోర్టు ఇచ్చిన తీర్పును ట్రంప్ తప్పు బట్టారు. జ్యూరీ తీసుకున్న నిర్ణయం అవమానకరమని అన్నారు. నిజమైన తీర్పు నవంబర్ 5న దేశ అధ్యక్ష ఎన్నికల్లో వస్తుందని తెలిపారు.

Related News

Philippines: ఫిలిప్పీన్స్‌ను వణికిస్తున్న ఫంగ్-వాంగ్‌ తుపాను.. స్పాట్‌లో 20 మంది

Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Donald Trump: టారిఫ్ లను వ్యతిరేకించేవాళ్లంతా ‘మూర్ఖులు’.. అమెరికన్లకు 2 వేల డాలర్ల డివిడెండ్: డొనాల్డ్ ట్రంప్

Elon Musk: ఎలాన్ మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ.. ఇంత డబ్బుతో ఏం చేస్తున్నాడు?

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

Big Stories

×