
Anasuya bharadwaj latest news(Celebrity news today): తెల్ల తెల్లని అనసూయ.. బీచ్‌లో తెల్లటి బికినీలో మెరిసిపోయింది. లేలేత సూర్యకిరణాల వెలుగుల్లో.. ఆమె లేలేత అందాలను క్లిక్ మనిపించారు. బికినీలో ఫుల్ రొమాంటిక్‌గా కనిపించింది అనసూయ. భర్తకు లిప్ టు లిప్ కిస్ ఇస్తూ ఫోటోలు దిగింది. అనసూయ, భరద్వాజ్‌ల పెళ్లిరోజు సందర్భంగా.. బీచ్‌లో సరదాగా గడిపిన వీడియోలు, పిక్స్.. ఇన్‌స్ట్రాలో పోస్ట్ చేస్తూ.. శ్రీవారికి ఓ ప్రేమలేఖ కూడా పోస్ట్ చేసింది.
భర్త గురించి, తమ అనుబంధం గురించి.. అనసూయ ఇలా రాసుకొచ్చింది.. “2001లో నువ్వు నాకోసం రాసిన తొలి ప్రేమలేఖ ఇంకా నాకు గుర్తుంది. నీకు అప్పుడు రిప్లై ఇవ్వలేకపోయాను. ఇప్పుడు నీపై నాకున్న ప్రేమను చెప్పడానికి ప్రయత్నిస్తాను.. మన ఇన్నేళ్ల జీవితంలో ఎంతోమంది నిన్ను ఎన్నో మాటలు అన్నారు.. వాటిని పట్టించుకోకుండా, నాపై ఇంతటి ప్రేమ చూపిస్తున్నావు.. మన వివాహబంధాన్ని ఎంతో అద్భుతంగా నిలబెడుతున్నావు.. నాకోసం ఇప్పటి వరకు ఎన్నో త్యాగాలు చేశావు.. నువ్వు నాపై చూపించే ప్రేమకు, నీ సహనానికి నేను ఆశ్చర్యపోతుంటాను.. మనమిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకుంటూ పైకి ఎదుగుతున్నాం.. మనం పర్‌ఫెక్ట్ కపుల్ కాదని నాకు తెలుసు.. కానీ కష్టసుఖాల్లో ఒకరికొకరం తోడుంటున్నాం.. ఆటుపోట్లు ఎదురైనా ఒక్కటిగా ముందుకు సాగుతున్నాం.. నన్ను నన్నుగా స్వాగతించినందుకు థ్యాంక్స్” అంటూ భర్తపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచింది అనసూయ.
పోస్ట్ అయితే బానే ఉందికానీ.. బికినీ ఫోటోలు, లిప్ లాక్ కిస్సులే చూడలేకపోతున్నామంటూ.. ముసలోళ్లకు దసరా పండుగంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

