Anasusya:సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జబర్దస్త్ యాంకర్ అనసూయ (Anasuya) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అక్కడ తన అద్భుతమైన వాక్చాతుర్యంతో గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు జబర్దస్త్ కు దూరమైంది. ఇక వరుస సినిమాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన విడుదలైన ‘పుష్ప 2’ సినిమాలో ద్రాక్షాయిణి పాత్రలో నటించి మరొకసారి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాలో అవకాశాన్ని రిజెక్ట్ చేయగా.. అందుకు గల కారణాన్ని తాజాగా వెల్లడించింది.
పవన్ కళ్యాణ్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన అనసూయ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఆయన కనిపిస్తే చాలు అభిమానులలో పూనకాలు వచ్చేస్తాయి. అది ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా.. ఆయన క్రేజ్ అలాంటిది మరి. ప్రస్తుతం పవర్ స్టార్ రాజకీయాలలో బిజీ అయిపోయారు. సమయం దొరికినప్పుడు మాత్రమే గతంలో ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా టాలీవుడ్ లో అత్యంత మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఈయన కూడా ఒకరు. ఇక అందుకే ఆయనతో నటించడం అంటే ఎంతో మంది అదృష్టంగా భావిస్తారు. కానీ అనసూయ మాత్రం పవన్ కళ్యాణ్ ఆఫర్ ను రిజెక్ట్ చేసింది. ఆ సినిమా ఏదో కాదు పవన్ కళ్యాణ్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచిన ‘అత్తారింటికి దారేది’. ఇందులో స్పెషల్ సాంగ్లో నటించే అవకాశం అనసూయకి వచ్చింది. అయితే అప్పుడు తాను గ్రూప్ గా చేయలేనని, కావాలంటే సింగల్ గా చేస్తానని చెప్పి రిజెక్ట్ చేసిందట. దీంతో ఈ విషయం అప్పట్లో చాలా కాంట్రవర్సీ గా కూడా మారింది.
పవన్ కళ్యాణ్ తో మాస్ స్టెప్పులేసిన అనసూయ..
ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ తో స్టెప్పులు వేసే అవకాశాన్ని దక్కించుకుంది అనసూయ. అది కూడా పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి స్పెషల్ సాంగ్ లో మాస్ స్టెప్పు లేసినట్లు సమాచారం. ఇక అదే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..’ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో పబ్ సాంగ్ ను నేను రిజెక్ట్ చేయడానికి గల కారణం ..అప్పటి మైండ్ సెట్ వేరుగా ఉంది. ఇప్పటి మైండ్ సెట్ వేరుగా ఉంది. కొన్ని విషయాలు సులభంగా అర్థమయ్యేవి కాదు. అప్పుడు ఆ టైం కి తాను తీసుకునే నిర్ణయమే కరెక్ట్ అనిపించేది. వేరే వాళ్ళు చెప్పినా పట్టించుకునే దాన్ని కాదు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాల్లో పబ్ సాంగుకు నో చెప్పాను. అంతే తప్ప వేరే కారణం లేదు. అప్పటికి ఇప్పటికీ ఎన్నో విషయాలు మారాయి. నాలో కూడా ఎంతో మార్పు వచ్చింది. మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం వచ్చింది.” అంటూ చెప్పుకొచ్చింది అనసూయ.
పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించిన అనసూయ..
అలాగే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ..” ఆయన సెట్ లో ఎప్పుడు పుస్తకాలు పట్టుకొని చదువుతూనే కనిపించేవారు. ఆ టైంలో పార్టీ మీటింగ్ అంటూ హడావిడిగా కనిపించేవారు. ఆయనది పిల్లాడి మనస్తత్వం. అటు రాజకీయాలు ఇటు సినిమాలు ఎలా మేనేజ్ చేస్తారు? అనే ఆశ్చర్యం కలుగుతుంది” అంటూ అనసూయ తెలిపింది.