U19 Women’s T20 World Cup: అండర్ – 19 మహిళల టీ-20 ప్రపంచ కప్ 2025 లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా కౌలాలంపూర్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండవ సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఘన విజయం సాధించింది. ఇక మరో సెమి ఫైనల్ లో ఆస్ట్రేలియా పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దీంతో ఈ రెండు జట్లు ఫైనల్ కి దూసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో ఆదివారం (ఫిబ్రవరి 2) న టైటిల్ పోరులో భారత్ – దక్షిణాఫ్రికా జట్లు తలబడబోతున్నాయి.
ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జరగనున్న {U19 Women’s T20 World Cup} ఈ ఫైనల్ మ్యాచ్ ఫ్రీగా చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రచారం ద్వారా చూడవచ్చు. ఈ టోర్నీకి స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ అధికారిక బ్రాడ్కాస్టర్ గా వ్యవహరిస్తుంది. కానీ ఈ మ్యాచ్ ను ఉచితంగా చూసే ఆస్కారం లేదు. స్టార్ స్పోర్ట్స్ తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ఈ టోర్నీలో జియో సినిమా – స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ భాగస్వామ్యం కావడంతో ఫ్రీగా మ్యాచ్ లను ప్రసారం చేయడం లేదు.
ఇక 2024 పురుషుల టి-20 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో సెమీస్ లో ఇంగ్లాండ్ ని చిత్తు చేసిన భారత జట్టు.. అనంతరం ఫైనల్ లో భారత్ – దక్షిణాఫ్రికా జట్ల మద్యే ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఓటమి అంచుల దాకా వెళ్ళిన భారత జట్టు విజయం సాధించింది. ఇప్పుడు భారత మహిళలు కూడా సెమీస్ లో ఇంగ్లాండ్ విజయం సాధించి ఫైనల్ లో అడుగు పెట్టారు. దీంతో సీన్ రిపీట్ అవుతుందా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఈరోజు జరిగే {U19 Women’s T20 World Cup} మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాను ఓడించాలని భారత క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.
Also Read: Ind vs Eng, 5th T20I: నేడే చివరి టీ20…భారీ మార్పులతో టీమిండియా..షమీకి నిరాశే !
మరోవైపు ఈ టోర్నీలో తెలంగాణ ప్లేయర్ గొంగడి త్రిష భారత జట్టుకు మోస్ట్ వ్యాలీబుల్ ప్లేయర్ గా మారింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్.. రెండింటిలోనూ సత్తా చాటుతుంది. గత ఆరు ఇన్నింగ్స్ లలో త్రిష 66.25 సగటుతో 265 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. అలాగే బౌలింగ్ లోనూ రాణిస్తోంది. మరోవైపు తొలిసారి ఫైనల్ చేరిన సౌత్ ఆఫ్రికా జట్టు.. ఈ ఐసీసీ టోర్నీ ఫైనల్లో బోల్తా కొట్టే తమ దేశ క్రికెట్ జట్ల ఆనవాయితీని మార్చాలని లక్ష్యంతో ఉంది. మొత్తానికి ఆసక్తికరంగా జరగబోయే ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో..? వేచి చూడాలి.