BigTV English

Anasuya: పుష్ప లేకుండా పార్టీనా.. దాక్షాయణి

Anasuya: పుష్ప లేకుండా పార్టీనా.. దాక్షాయణి


Anasuya:పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ దాదాపు మూడేళ్ల నిరీక్షణ తర్వాత పుష్ప 2 తో అభిమానులు ముందుకు రానున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ఇండస్ట్రీ మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఏప్రిల్ 8వ తేదీ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. పుష్ప మాస్ జాతర పేరుతో నిత్యం కొత్త కొత్త పోస్టర్లతో హైప్ క్రియేట్ చేస్తున్నారు. నిన్నటికి నిన్న అమ్మవారు గెటప్ లో ఉన్న అల్లు అర్జున్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే.


ఇక తాజాగా యాంకర్ అనసూయ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తో పుష్ప 2 పై మరింత హైప్ క్రియేట్ చేసింది. పుష్ప పార్ట్ 1 లో అనసూయ దాక్షాయిని పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. సిండికేట్ హెడ్ మంగళం శీను భార్యగా ఆమె నటన సినిమాకు హైలెట్ గా మారింది. తాజాగా ఆమె పుష్ప చిత్ర బృందంతో కలిసి దిగిన ఒక క్రేజీ సెల్ఫీని అభిమానులతో పంచుకుంది.

ఇక ఈ ఫోటోలో అనసూయతో పాటు బ్రహ్మాజీ, ఫహద్ ఫాజిల్, సుకుమార్, సునీల్ ఉన్నారు. అయితే పుష్పరాజు మాత్రం కనిపించలేదు. ఇక దీనికి అనసూయ క్యాప్షన్ ఇస్తూ “దేశం మొత్తం కాదు.. బహుశా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల మొత్తం పుష్ప 2 ది రూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక్కడ మేము దానికోసమే ప్లాన్ చేస్తున్నాము” అంటూ రాసుకొచ్చింది. ఇక ఈ ఫొటోలో అల్లు అర్జున్ లేకపోవడంతో.. పుష్ప లేకుండా పార్టీనా.. దాక్షాయణి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో అనసూయ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×