BigTV English

Amazon Bazar: మీ షోకు పోటీ ఇస్తున్న అమెజాన్.. లైవ్‌లోకి ‘బజార్‌’.. అతి తక్కువ ధరకే అన్ని రకాల వస్తువులు

Amazon Bazar: మీ షోకు పోటీ ఇస్తున్న అమెజాన్.. లైవ్‌లోకి ‘బజార్‌’.. అతి తక్కువ ధరకే అన్ని రకాల వస్తువులు


Amazon Bazar: మార్కెట్లోకి అనేక రకాల కంపెనీలు వస్తూనే ఉన్నాయి. అతి తక్కువ ధరలకు వస్తువులను అమ్మకాలు చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా మీ షో వంటి చీపెస్ట్ యాప్ కు పోటీగా అమెజాన్ ఓ సరికొత్త ఆలోచనతో వచ్చింది. తాజాగా అతి తక్కువ ధరకే అన్ని రకాల వస్తువులను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇది మీషో, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ లకు పోటీగానే తెచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ సరికొత్త ఆలోచనతో కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అన్ బ్రాండెడ్, అతి తక్కువ ధర వస్తువులు, ఫ్యాషన్, ఇంటికి సంబంధించిన అన్ని రకాల వస్తువులను అతి తక్కువ ధరకే తీసుకువచ్చింది. ‘బజార్’పేరిట అమెజాన్ యాప్ లో లైవ్ లోకి వచ్చింది. కేవలం రూ. 600ల లోపే అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉండనున్నాయి. వాచ్ లు, ఫుట్ వేర్, దుస్తులు, ఇంటి సామాగ్రి వంటి అన్ని రకాల వస్తువులు కూడా అమెజాన్ బజార్ లో అందుబాటులో ఉన్నాయి.


చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఫ్యాషన్ కు సంబంధించిన అన్ని రకాల కేటగిరీలకు చెందిన ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. చీరలు, కుర్తాలు, టీషర్టులు, షర్టులు, బెడ్ షీట్లు, డోర్ కర్టెన్స్, హ్యాండ్ బ్యాగులు వంటి అనేక రకాల ఉత్పత్తులు అమెజాన్ బజార్ లో లభించనున్నాయి. అయితే ఈ వస్తువుల డెలివరీకి మాత్రం 4 నుంచి 5 రోజుల సమయం తీసుకోనుంది. ప్రైమ్ కస్టమర్లకు మాత్రం ఒక్క రోజులోనే డెలివరీ చేస్తుంది. తన వ్యాపారాన్ని పెంచుకునేందుకు అమెజాన్ ఈ కొత్త బజార్ ను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Tags

Related News

Personal Finance: 45 సంవత్సరాలకే రిటైరయ్యి పెన్షన్ పొందుతూ లైఫ్ హాయిగా గడపాలని ఉందా..అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..

Central Govt Scheme: విదేశాల్లో చదవాలని ఉందా… అయితే కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 40 లక్షల లోన్ కోసం ఇలా అప్లై చేసుకోండి.

Mobile Recharge: ఎయిర్ టెల్ లోని ఈ ఆఫర్ తో రీచార్జ్ చేస్తే Netflix, Prime Video, Zee5, JioHotstar ఫ్రీగా చూసే ఛాన్స్..

Real Estate: రెంటల్ అగ్రిమెంట్ 11 నెలలు మాత్రమే ఎందుకు చేయించుకుంటారు..దీని వెనుక ఉన్న అసలు మతలబు ఇదే..

Real Estate: క్లియర్ టైటిల్ ల్యాండ్ కొనాలి అంటే తప్పనిసరిగా చూడాల్సిన డాక్యుమెంట్స్ ఇవే…లేకపోతే భారీ నష్టం తప్పదు..

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Big Stories

×