BigTV English

Jabardast Rashmi: పాన్ ఇండియా సినిమాలో అవకాశం.. దశ తిరిగేనా.

Jabardast Rashmi: పాన్ ఇండియా సినిమాలో అవకాశం.. దశ తిరిగేనా.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమాలో అవకాశం అంటే ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాంటి ఈ అవకాశం యాంకర్ రష్మీ (Rashmi) కి వచ్చినట్టు తెలుస్తోంది. మరి యాంకర్ రష్మికి ప్రభాస్ నటిస్తున్న ఏ సినిమాలో అవకాశం కొట్టేసిందో ఇప్పుడు చూద్దాం..


సలార్ -2 లో అవకాశం కొట్టేసిన రష్మీ..

యాంకర్ రష్మీ.. యాంకర్ కాకముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ, జబర్దస్త్ (Jabardasth) షో ద్వారానే బాగా ఫేమస్ అయ్యింది. జబర్దస్త్ లో యాంకర్ అనసూయ (Anasuya)తర్వాత మళ్లీ అంతటి గుర్తింపు సంపాదించుకుంది రష్మి. అనసూయ వెళ్ళిపోయాక జబర్దస్త్ కి రారాణిలా రష్మి పేరు తెచ్చుకుంది. కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి కూడా రష్మీ యాంకరింగ్ చేసింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ , కేవలం షోలు మాత్రమే కాకుండా పలు సినిమాల్లో హీరోయిన్ గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తోంది. అలా రష్మీ ఇప్పటి వరకు కరెంట్, హోలీ,ప్రస్థానం, బిందాస్, నెక్స్ట్ నువ్వే,తను వచ్చెనంట, రాణి గారి బంగ్లా వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది.


ఒక్క సినిమాతో భారీ గుర్తింపు..

అలాగే గుంటూరు టాకీస్, బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఇక యాంకర్ రష్మీ కి మంచి పేరు తెచ్చిన సినిమా ‘గుంటూరు టాకీస్’ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో రష్మి గౌతమ్ చాలా బోల్డ్ గా సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda)తో కలిసి నటించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ దశ ఇన్నాళ్ళకు తిరిగినట్టు తెలుస్తోంది. ఎందుకంటే తాజాగా రష్మి గౌతమ్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అదేంటంటే.. రష్మీ గౌతమ్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్ ‘సలార్ -2’ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో రష్మి గౌతమ్ కి ఒక కీలక పాత్ర ఇచ్చారట ప్రశాంత్ నీల్. అయితే ఈ పాత్రలో రష్మి గౌతమ్ సెట్ అవుతుంది అని, ఆమెకు తగ్గట్టు పాత్రనే డిజైన్ చేశారట. ఇక ఈ విషయం తెలియడంతో రష్మీ ఎగిరి గంతేసినట్టు తెలుస్తోంది.

రష్మీ దశ తిరిగినట్టేనా..?

అంతేకాదు ప్రశాంత్ నీల్ కి ఫోన్ చేసి మరీ థాంక్స్ చెప్పినట్టు సమాచారం. అయితే రష్మీ గౌతమ్ కి సలార్ 2లో అవకాశం వచ్చినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని,అదంతా ఫేక్ న్యూస్ అంటూ కొట్టి పారేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. రష్మికి ప్రభాస్ సినిమాలో అవకాశం రావడం ఏంటి? అని కూడా కామెంట్లు పెడుతున్నారు. కానీ మరికొంతమందేమో ఎందుకు రష్మీకి అవకాశం రాకూడదా.. ? జవాన్ సినిమాలో సిరి హనుమంతుని తీసుకోలేదా..? దేవర సినిమాలో చైత్ర రాయ్ ని తీసుకోలేదా..? మరి రష్మిని సలార్ -2 లో తీసుకుంటే తప్పేంటి? అని కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ సలార్ -2 లో రష్మీకి నిజంగానే అవకాశం రావాలని, ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. మరి చూడాలి రష్మికి ప్రభాస్ సినిమాలో అవకాశం వచ్చింది అని వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే రష్మీ దశ తిరిగినట్టే అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×