Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కూలీ’ (Coolie). తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ని షేర్ చేసుకున్నారు రజినీకాంత్. బ్యాంకాక్ కు వెళ్తూ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చిన రజనీకాంత్ అక్కడ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అందులో భాగంగానే ‘కూలీ’ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను కూడా పంచుకున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) 2024లో రెండు సినిమాలతో థియేటర్లోకి వచ్చారు. ఆయన నటించిన ‘లాల్ సలామ్’, ‘వెట్టయాన్’ సినిమాలో ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ రెండు సినిమాల వల్ల నిరాశ పడిన రజిని అభిమానులు… ఇప్పుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న రజినీ నెక్స్ట్ మూవీ ‘కూలీ’ (Coolie)పై దృష్టి పెట్టారు. సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ‘కూలీ’ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ లాంటి డైరెక్టర్ దర్శకత్వం వహిస్తూ ఉండడం ఒక ప్లస్ పాయింట్ అయితే, ఇందులో రజనీకాంత్ తో పాటు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), శృతి హాసన్ (Shruti Haasan), షౌబిన్ షాహీర్, ఉపేంద్ర, సత్యరాజ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా స్పెషల్ గెస్ట్ రోల్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఇంతమంది నటీనటులు సినిమాలో భాగం కావడంతో ఆల్రెడీ మూవీపై మంచి హైప్ నెలకొంది.
గత కొంతకాలంగా భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా నుంచి మేకర్స్ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ ను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇంకా షూటింగ్ జరుగుతున్న ఉన్న ఈ సినిమాను 2025 మే 1న రిలీజ్ చేయబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంకా దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ తాజాగా రజనీకాంత్ (Rajinikanth) ఈ సినిమాకు సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ తో పాటు, షూటింగ్ ఎక్కడిదాకా వచ్చింది అనే విషయాన్ని కూడా వెల్లడించారు.
తాజాగా రజనీకాంత్ బ్యాంకాక్ కు బయలు దేరుతూ, చెన్నై విమానాశ్రయంలో కనిపించారు. ఈ నేపథ్యంలో మీడియా ఆయనను ‘కూలీ’ (Coolie) మూవీ అప్డేట్ గురించి అడగ్గా, రజనీకాంత్ స్పందిస్తూ “ఇప్పటికే కూలలీ మూవీకి సంబంధించిన 70% షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను బ్యాంకాక్ లో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ జనవరి 13 నుంచి 28 వరకు జరగబోతోంది” అంటూ చెప్పుకొచ్చారు. రజినీకాంత్ ఈ షెడ్యూల్ కోసమే బ్యాంకాక్ కు బయలుదేరినట్టు తెలుస్తోంది.
ఇక రజనీకాంత్ మరోవైపు యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. కేవలం ‘కూలీ’ (Coolie) మూవీ మాత్రమే కాకుండా ఆయన త్వరలోనే ‘జైలర్ 2’ (Jailer 2) మూవీని కూడా షురూ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మోస్ట్ అవైటింగ్ సినిమాల రిలీజ్ డేట్ల గురించి ఈగర్ వెయిట్ చేస్తున్నారు రజినీ అభిమానులు.