Game changer Pre Release Event:’ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ హీరోగా మారిపోయారు రామ్ చరణ్ (Ram Charan). ఇప్పుడు సోలో హీరోగా ఆయన నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer). ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎస్. శంకర్ (S.Shankar) అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dilraju) ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక భారీ హంగులతో ఊహించని అంచనాలతో జనవరి 10వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాజమండ్రిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కూడా విచ్చేశారు. చీఫ్ గెస్ట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ స్టేజ్ పై మాట్లాడుతూ.. రామ్ చరణ్ పేరు వెనుక ఉన్న అసలు విషయాన్ని తెలియజేశారు.
రామ్ చరణ్ పేరు వెనుక ఇంత అర్థం ఉందా..
అసలు విషయంలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చిన తొలి సినిమా ఈవెంట్ ఇదే కావడం గమనార్హం. ఈ క్రమంలోనే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక పవన్ కళ్యాణ్ ను నేరుగా చూడడానికి రాజమండ్రికి పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు మెగా ఫ్యాన్స్ అంతా చేరుకున్నారు. దాదాపు లక్ష మందికి పైగా అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అని చెప్పవచ్చు. ఇక ఈ వేదికగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మా అన్నయ్య చిరంజీవి(Chiranjeevi)కి అబ్బాయి పుట్టాడని చెప్పారు. ఇక తర్వాత ఇంట్లో నామకరణం చేయాలని అనుకున్నప్పుడు, మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా హనుమంతుడి భక్తులము. అందుకే అన్నయ్యకి పుట్టిన కొడుకుకి కూడా హనుమంతుడి పేరు కలిసేలా మా నాన్నగారు పేరు పెట్టాలనుకున్నారు. ఇక అందులో భాగంగానే రాముడి చరణాల వద్ద ఉండే హనుమంతుడు – రామ్ చరణ్.. అందుకే నాన్న ఇలాంటి పేరు పెట్టారు. అయితే ఎంత బలవంతుడు అయినా ఎంత గొప్పవాడు అయినా రాముడి చరణాల వద్ద హనుమంతుడు ఉండాల్సిందే. ఇక ఆ పేరుకు తగ్గట్టుగానే మా రామ్ చరణ్ కూడా అలాగే వ్యవహరిస్తాడు. నేడు గ్లోబల్ స్టార్ అయి ఉండవచ్చు. కానీ మా ముందు ఎప్పుడూ కూడా ఆ స్టేటస్ ను చూపించలేదు. అంత గొప్పవాడు రామ్ చరణ్. నాడు మా నాన్న ఆలోచించి ఈ పేరు పెట్టాడు కాబట్టి ఆ పేరుకు తగ్గట్టుగానే రామ్ చరణ్ ప్రవర్తిస్తున్నాడు” అంటూ రాంచరణ్ పేరు వెనుక ఉన్న అర్థాన్ని , ఫ్యామిలీ రహస్యాన్ని పవన్ కళ్యాణ్ బయట పెట్టారు. ఇక పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఒరిజినల్ గేమ్ ఛేంజర్ చిరంజీవే..
అలాగే పవన్ కళ్యాణ్ మూలాలు మరిచిపోనని తనను ఎంతమంది గేమ్ ఛేంజర్, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అన్నప్పటికీ ఇదంతా కేవలం చిరంజీవి వల్లే వచ్చిందని తెలిపారు. ఇక చిరంజీవి తనకు తండ్రి సమానుడని, తన వదిన సురేఖ తల్లి సమానురాలని, అలాగే రామ్ చరణ్ తమ్ముడు తో సమానం అని కూడా తెలిపారు. ఇక ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.