TG Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. కాసేపటి క్రితే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయంలో ఈ భేటీ జరిగింది. దాదాపు మూడున్నర గంటల పాటు భేటీ జరిగింది. కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 22 అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించారు.
ఈ నేపథ్యంలోనే కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ కార్డు లేని వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు నిర్ణయించారు. త్వరలోనే ప్రజల నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించి అప్లకేషన్లు తీసుకొని.. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది.అలాగే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించారు. పాలమూరు ప్రాజెక్ట్-2 వ్యయం రూ.1784 కోట్లకు పెంచారు.
రాష్ట్ర వ్యాప్తంగా 56 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేయడానికి ఆమోదం తెలిపింది. గే రైతు భరోసాకి కూడా ఆమోదం తెలిపింది. ఇందిరమ్మ ఇళ్లు, బీసీ రిజర్వేషన్ల పెంపు, నూతన మండలాల ఏర్పాట్లపై భేటీలో చర్చ జరిగింది. అలాగే రేషన్ కార్డుల జారీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే కేబినెట్ భేటీలో సన్నబియ్యం పంపిణీ కూడా చర్చించారు. సంక్రాంతి పండుగ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత రేషన్ కింద సన్న బియ్యం పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ టూరిజం పాలసీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
Also Read: Jobs in Punjab National Bank: గుడ్ న్యూస్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు..
రైతు భరోసాకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. ఏడాదికి ఎకరానికి రూ.12వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎకరానికి రూ.6వేల చోప్పున రెండు విడతలుగా రైతు భరోసా ఇవ్వనున్నట్లు తెలిపారు. గుట్టలు, కొండలు, పరిశ్రమలకు తీసుకున్న భూములకు రైతుభరోసా వర్తించదని చెప్పారు. అలాగేభూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి యేటా రూ.12వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు..