Game Changer Pre Release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్.. కొలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10 న థియేటర్లలోకి రాబోతుంది. మరి కొద్ది రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు. సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యేల రోజుకో అప్డేట్ ను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.. నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమా పై భారీ హైప్ ను క్రియేట్ చేసింది.. రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ అదిరిపోయిందని ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది.. ఇక నేడు ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను రాజమండ్రిలో అట్టహాసంగా జరగబోతున్న సంగతి తెలిసిందే.. ఈ కార్యక్రమానికి మూవీ యూనిట్ తో పాటుగా ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఆయన స్పీచ్ మెగా ఫ్యాన్స్ తో పాటు యావత్ సినీ అభిమానులను, జనసైనికులను ఆకట్టుకుంటుంది.. పవన్ కళ్యాణ్ స్పీచ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
గేమ్ ఛేంజర్ ఈవెంట్ లో పవన్ స్పీచ్..
బాబాయ్ – అబ్బాయి కలిసి ఒకే స్టేజి పై చూసి చాలా కాలం అయ్యింది.. గతంలో నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. మళ్ళీ ఇన్నేళ్లకు ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఈవెంట్ లో పాల్గొంటుండడంతో అభిమానులు అసంఖ్యాకంగా రాజమండ్రి సభా ప్రాంగణం వద్దకు చేరుకొని పవన్ అనే నినాదాలు చేస్తున్నారు. అక్కడ మొత్తం ఓజీ అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి.. ఇక పవన్ కళ్యాణ్ స్పీచ్ ఈవెంట్ కు హైలెట్ అయ్యింది..
మూలాలు మర్చిపోవద్దు.. కౌంటర్ ఎవరికీ..?
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఈవెంట్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.. ఆయన మాట్లాడుతూ.. రామ్ చరణ్ అసలైన గేమ్ చేయించారని అని పొగడ్తలతో అబ్బాయిని ముంచేశారు బాబాయ్.. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మనం మూలాలని మర్చిపోకూడదని చాలామంది అన్నారు. చిరంజీవి గారి వల్లే మేమంతా ఈ స్టేజ్ లో ఉన్నాం.. ఆయనే స్ఫూర్తిగా మాకు ఈ స్థాయిలో నిలిచేలా చేశారు. అలాంటి ఆయన్ని మేము ఎప్పుడూ కాదనలేదు అని అన్నపై ప్రశంసలు కురిపించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మనము ఏ స్థాయికి వచ్చినా మనం వచ్చిన మూలాలని మర్చిపోకూడదు అది గుర్తుపెట్టుకుంటే ఎప్పటికైనా పై స్థాయిలో ఉంటాం అన్నట్లు కౌంటర్ వేసాడు. పెద్దల మాటను ఎప్పుడు పెడచెవిన పెట్టొద్దని వరుసగా కౌంటర్లు వేశారు. ఇక ఆ కౌంటర్ అల్లు అర్జున్ కేనా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ స్పీచ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
ఇక గేమ్ ఛేంజర్ విషయానికొస్తే.. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో భారీగా ఈ సినిమా తెరకెక్కింది. SJ సూర్య, అంజలి, నవీన్ చంద్ర, కియారా అద్వానీ, శ్రీకాంత్, సునీల్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో భారీ హైప్ తెచ్చుకుంది.. సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..