BigTV English

Anil Ravipudi: సీనియర్ స్టార్స్ తో మల్టీస్టారర్.. అనిల్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

Anil Ravipudi: సీనియర్ స్టార్స్ తో మల్టీస్టారర్.. అనిల్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

Anil Ravipudi:ప్రముఖ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ప్రస్తుతం స్టార్ సీనియర్ హీరోలతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే బాలకృష్ణ (Balakrishna) తో ‘భగవంత్ కేసరి’ సినిమా చేసిన అనిల్ రావిపూడి, ఇప్పుడు వెంకటేష్ (Venkatesh ) తో కలిసి ‘సంక్రాంతికి వస్తున్నాం, అనే సినిమా చేశారు. గతంలోని వీరిద్దరి కాంబినేషన్లో ఎఫ్2, ఎఫ్3 సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుక జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి చూపు మరో ఇద్దరి సీనియర్ స్టార్ హీరోలపై పడిందని సమాచారం. వారెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), కింగ్ నాగార్జున (Nagarjuna).


చిరంజీవి, నాగార్జునతో అనిల్ మల్టీ స్టారర్..

అసలు విషయంలోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాకు ఎప్పటినుంచో సన్నహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా చిరంజీవి 156 అవుతుందా? లేక చిరంజీవి 157 మూవీ అవుతుందా? అన్నది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్లానింగ్ జరుగుతోందట. వచ్చే ఏడాది ఈ సినిమాని పెట్టాలెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ స్టోరీ విషయంలో అనిల్ ఒక టర్నింగ్ పాయింట్ తీసుకున్నట్లు సమాచారం. ఈ కథను చిరంజీవి, నాగార్జున ఇద్దరితో కలిసి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగానే కథలో కొన్ని మార్పులు చేసి మల్టీస్టారర్ మూవీగా మార్చాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


నిజమైతే.. ఆ క్రెడిట్ అనిల్ కే..

ఒకవేళ ఇదే నిజమైతే అటు చిరంజీవి ఇటు నాగార్జున అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. అంతేకాదు వీరిద్దరిని ఒకే ఫ్రేమ్లో చూడాలని అభిమానులు కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. దీంతో అనిల్ రూపంలో వారి అభిమానుల కోరిక కూడా తీరబోతుందని తెలుస్తోంది. అంతేకాదు ఇదే నిజమైతే ఇండస్ట్రీకి నాలుగు దిగ్గజాలైన వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లతో అనిల్ రావిపూడి సినిమా చేసినట్టు అవుతుందని కూడా కామెంట్ లు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్..

ఆ పని అనిల్ కి వెన్నతో పెట్టిన విద్య..

ఇకపోతే ఒక సినిమాలో ఒకేసారి ఇద్దరు హీరోలను ఎలా డీల్ చేయాలో అనిల్ రావిపూడికి బాగా తెలుసు. ఇప్పటికే ఎఫ్2, ఎఫ్3 చిత్రాలతో వెంకటేష్, వరుణ్ తేజ్ (Varun Tej) కాంబోలో వచ్చిన రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందించాయి. దీనికి తోడు ఈ రెండు చిత్రాలు కూడా మంచి కామెడీ నేపథ్యంలో వచ్చినవే. అయితే ఇప్పుడు ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలతో అనిల్ రావిపూడి ఒక కథను ఎలా డీల్ చేస్తారు? అని సినీ ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి అనిల్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

చిరంజీవి, నాగార్జున సినిమాలు..

ఇక చిరంజీవి విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం. మరి ఈ చిత్రాలు పూర్తయిన తర్వాతనే అనిల్ రావిపూడి కి అవకాశం ఇస్తారా? అన్నది తెలియాలి. మరొకవైపు నాగార్జున కూలీ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×