Tollywood director:కళ్యాణ్ రామ్(Kalyan Ram) హీరోగా ‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా తొలి పరిచయంలోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు అనిల్ రావిపూడి (Anil ravipudi).ఆ తర్వాత స్టార్ హీరోలను ఎంపిక చేసుకుంటూ వారితో కామెడీ చేయిస్తూ.. ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్గా సినిమాలు తీస్తున్నారు. ఇక తాను నమ్ముకున్న జానర్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇక ఇప్పటివరకు దాదాపు 8 కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రతి చిత్రంతో కూడా తనకంటూ ఒక సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఈ సంక్రాంతికి జనవరి 14వ తేదీన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా, ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి(Meenakshi Choudhary) హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఇప్పటికే ప్రాంతీయ చిత్రంగా విడుదలై దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఈ సక్సెస్ జోరులో ఉన్న అనిల్ రావిపూడి.. ఫిబ్రవరి 12వ తేదీన తన సొంత ఊరిలో గృహప్రవేశం కూడా చేపడుతున్నారు.
ఘనంగా లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఇక ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే తన సెంటిమెంట్ ప్రకారం చిరంజీవితో చేయబోయే సినిమా స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. ఇదిలా వుండగా తాజాగా విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటిస్తున్న ‘లైలా’ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే నిన్న అనగా ఫిబ్రవరి 9న హైదరాబాదులో చాలా ఘనంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈయనతో పాటు అనిల్ రావిపూడి (Anil ravipudi) కూడా గెస్ట్ గా వచ్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆ హీరోయిన్ లా పుట్టాలి – అనిల్ రావిపూడి..
ఇకపోతే ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించిన సుమ కనకాల (Suma Kanakala) అనిల్ రావిపూడి తో..” వచ్చే జన్మలో ఆడపిల్లగా పుట్టే అవకాశం ఉంటే? ఏ హీరోయిన్గా పుట్టాలని మీరు కోరుకుంటున్నారు?” అంటూ అడిగింది. దానికి అనిల్ రావిపూడి స్పందిస్తూ..”అప్పట్లో అయితే శ్రీదేవి (Sridevi) లాగా.. ఇప్పుడైతే తమన్న (Tamannaah) లాగా పుట్టాలని కోరుకుంటున్నాను అంటూ సమాధానం చెప్పారు. ఇక దీంతో ఫంక్షన్ కి వచ్చిన అభిమానులు అంతా కూడా అరుపులు, కేకలతో కార్యక్రమానికి కొత్త జోష్ తీసుకొచ్చారని చెప్పవచ్చు. మొత్తానికైతే అనిల్ రావిపూడి చేసిన ఈ కామెంట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
లైలా మూవీ విశేషాలు..
ఇక లైలా (Laila) సినిమా విషయానికి వస్తే.. ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల కాబోతున్న ఈ చిత్రంలో మొదటిసారి లేడీ గెటప్ లో కనిపించనున్నారు విశ్వక్ సేన్ (Vishwak Sen). ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ‘ ఏ’ సర్టిఫికెట్ జారీ చేయడంతో కాస్త ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాపై ఆసక్తి కనబరిచడం లేదని సమాచారం. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.