BigTV English
Advertisement

Rohit Sharma: రోహిత్ శర్మకు ఒడిశా సీఎం అదిరిపోయే గిఫ్ట్ !

Rohit Sharma: రోహిత్ శర్మకు ఒడిశా సీఎం అదిరిపోయే గిఫ్ట్ !

Rohit Sharma:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండవ వన్డే కటక్ వేదికగా జరిగింది. అయితే ఒడిస్సా కటక్ లో జరిగిన రెండవ వన్డే మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ తో రాణించిన నేపథ్యంలో… సిరీస్ కూడా కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్… తిలకించేందుకు ఒడిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ రావడం జరిగింది. ఈ సందర్భంగా టీమిండియా ప్లేయర్లు.. సాధించిన విజయం పై ప్రశంసలు కురిపించారు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ ( Odisha CM Mohan Charan Majhi ).


Also Read: Ind vs Eng 2nd Odi: రెండో వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ..సిరీస్ కైవసం !

నవీన్ పట్నాయక్ ఓడిపోయిన తర్వాత కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ నియామకమైన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత… టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మతో… స్టేడియంలో సరదాగా గడిపారు సీఎం మోహన్ చరణ్. రోహిత్ శర్మ అలాగే ఒడిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ ( Odisha CM Mohan Charan Majhi ) ఇద్దరు కలిసి.. ఫోటోలు కూడా దిగారు. అయితే… టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. అలాగే ప్లేయర్ లందరికీ నిన్న రాత్రి బిగ్ ట్రీట్ ఇచ్చారట ఒడిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్. రాత్రి ప్రత్యేకంగా ఒడిస్సా రుచులతో.. అందరికీ భోజనం ఏర్పాటు చేయించారట ముఖ్యమంత్రి మోహన్.


ఈ రాత్రి డిన్నర్ కు టీమ్ ఇండియా ప్లేయర్లు, అలాగే సిబ్బంది, కోచ్ గౌతమ్ గంభీర్ తదితరులు అందరూ హ్యాపీగా పాల్గొన్నారు. దానికి తగ్గట్టుగానే ఒడిస్సా ప్రభుత్వం కూడా…. టీమిండియా ప్లేయర్లకు మంచి ట్రీట్ ఇచ్చిందని చెబుతున్నారు. ఒడిస్సా రుచులు టెస్ట్ చేసిన తర్వాత… టీమిండియా ప్లేయర్లు అంతా చాలా బాగుందని సమాధానం ఇచ్చారట. ఇది ఇలా ఉండగా నిన్నటి రెండవ వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టును మట్టికరిపించింది టీమిండియా. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0 గెలుచుకుంది రోహిత్ శర్మ సేన.

Also Read: Ind vs Eng 2nd Odi: అర్ధాంతరంగా ఆగిపోయిన మ్యాచ్… కరెంట్ బిల్లు కట్టలేదా ఏంటి?

నిన్నటి మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. మొదట్లో ఇంగ్లాండ్ ఓపెనర్స్ వికెట్ పడకుండా దాటిగా ఆడారు. కానీ ఆ తర్వాత రవీంద్ర జడేజా పికప్ అందుకోవడంతో… 100 స్కోర్ దాటిన తర్వాత ఇంగ్లాండ్ ప్లేయర్లు మళ్ళీ పెవిలియన్ బాట పట్టారు. ఆ తరుణంలో బ్రూక్, రూట్, లియామ్ లివింగ్ స్టన్ బాగా రాణించి 304 పరుగులు చేశారు. అయితే ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ప్లేయర్లు దూకుడుగా ఆడారు. టీమిండియా ఓపెనర్లు గిల్ అలాగే రోహిత్ శర్మ… ఇద్దరు కూడా ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ తరుణంలోనే 44.3 ఓవర్లలో…. లక్ష్యాన్ని చేదించింది టీమిండియా. దీంతో నాలుగు వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. ఇక ఈ మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీ తో రాణించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. 90 బంతుల్లో 119 పరుగులు చేసి దుమ్ము లేపాడు రోహిత్ శర్మ. ఇందులో 12 బౌండరీలు అలాగే ఏడు సిక్సర్లు ఉన్నాయి.

Related News

Jahanara Alam : సె**క్స్ కోసం పీరియడ్స్ డేట్ అడిగేవాడు.. ఏడ్చేసిన బంగ్లా క్రికెటర్

IND vs PAK: పాకిస్తాన్ కొంప ముంచిన వ‌ర్షం..టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

Sree Charani : శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా.. గ్రూప్-1 జాబ్, రూ.2.5 కోట్లు, ఇంటి స్థలం

Hong Kong Sixes 2025: 6, 6, 6, 6, 6, 6 పాకిస్తాన్ ప్లేయ‌ర్ విధ్వంసం..6 బంతుల్లో 6 సిక్స‌ర్లు..వీడియో వైర‌ల్‌

Shivam Dube: హ‌ర్షిత్ రాణా కోసం శివమ్ దూబే కెరీర్ నాశనం..బ‌ల‌వంతంగా బ్యాటింగ్ చేయిస్తున్న గంభీర్‌

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్‌, వేదిక‌లు ఖ‌రారు..ఇండియాకు రాబోమంటున్న‌ పాకిస్తాన్ ?

Quinton de Kock : రిటైర్మెంట్ వెన‌క్కి తీసుకుని, రీ-ఎంట్రీ ఇచ్చాడు…సెంచ‌రీతో పాకిస్తాన్ ను చిత్తు చేశాడు

Hong Kong Sixes 2025: నేడు టీమిండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య 6 ఓవ‌ర్ల మ్యాచ్‌…షెడ్యూల్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

Big Stories

×