
Animal movie Update : అర్జున్ రెడ్డి మూవీ తో ఇటు తెలుగు అటు హిందీ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. డైరెక్ట్ చేసింది ఒకే మూవీ అయిన అతను తర్వాత చేయబోయే చిత్రాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ‘యానిమల్’ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.ఈ మూవీ లో బాలివుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్,నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్నారు.
ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్ పాటలు ,ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ మూవీ డిసెంబర్ 1 న వరల్డ్ వైడ్ గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉంది. మూవీ టీం ప్రమోషన్స్ మాంచి జోరుగా చేస్తోంది. దీంతో మూవి పై పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆ న్యూస్ మరి ఏమిటో కాదు చిత్రానికి సంబంధించిన రన్ టైం గురించిన న్యూస్. ఈ మూవీ రన్ టైమ్ ఎంతో తెలిస్తే ఎవరైనా షాక్ కావాల్సిందే. ఇంతకీ మూవీ రన్ టైమ్ ఎంతో తెలుసా మూడు గంటల 21 నిమిషాలు అంట. ఇదే కనుక నిజమైతే ఇటీవల కాలంలో వచ్చిన అతి పెద్ద బాలీవుడ్ చిత్రంగా ఈ మూవీ నిలుస్తుంది.
2016 లో వచ్చిన ధోని బయోపిక్ మూవీ ‘ధోనీ’ సినిమా వన్ టైం మూడు గంటల పది నిమిషాలు ఉంది. ఆ తర్వాత మూడు గంటల పైన రన్ టైం కలిగిన లెంగ్తియస్ట్ చిత్రం ఇదే కావడం విశేషం.
అంత లెంథి చిత్రం అంటే థియేటర్లో ప్రేక్షకులు కూర్చోవడం కష్టమనే చెప్పాలి.అయితే బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ టెర్రిఫిక్ ఉందని తెలుస్తోంది. కానీ ఇంత లెంగ్త్ రన్లైమ్ ఉండే మూవీస్ వల్ల మల్టిప్లెక్స్ థియేటర్లకు మాత్రం పెద్దదెబ్బే. షో లు ఎప్పటిలా కాకుండా కాస్త త్వరగానే మొదలు పెట్టాల్సి ఉంటుంది. మామూలుగా హిట్ అయిన సినిమాలు రోజుకు ఆరు షోలు వేస్తే థియేటర్లకు బాగా కలిసి వస్తుంది కానీ ఈ మూవీ ని 5 షోలకు మించి వేయలేరు. వన్ టైం గురించి ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు కాబట్టి ఇందులో మార్పులు ఉండే అవకాశం కూడా ఉంది.