BigTV English

Animal movie: ‘యానిమల్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. సినీ ప్రియులకు పూనకాలే..

Animal movie: ‘యానిమల్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. సినీ ప్రియులకు పూనకాలే..

Animal movie: రణ్‌బీర్‌ కపూర్‌ – సందీప్‌ వంగా కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్ యాక్షన్‌ డ్రామా ‘యానిమల్‌’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి అదరగొట్టింది. ఇక థియేటర్లలో దుమ్ము దులిపేసిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు.


ఈ నేపథ్యంలో అభిమానులకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌ అదిరిపోయే ట్రీట్ అందించింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26వ తేదీ అంటే.. రేపటి నుంచి ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు ప్రకటించింది. అంతేకాదు.. సినీ లవర్స్‌కు మరింత సర్‌ప్రైజ్‌ జోడించి ఓటీటీ వెర్షన్‌ అందించనున్నారు.

దాదాపు 8 నిమిషాల అదనపు నిడివితో దీన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. థియేటర్‌లో చూడలేకపోయిన కొన్ని సన్నివేశాలను ఓటీటీ వెర్షన్‌లో చూసే అవకాశం కల్పించారు. థియేటర్లలో 3 గంటల 21 నిమిషాలు ఉన్న మూవీ రన్ టైం.. ఓటీటీ వెర్షన్‌లో అదనపు సన్నివేశాలను కలిపి దాదాపు మూడున్నర గంటలతో ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేస్తున్నారు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×