
Animal movie Trailer :అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ యానిమల్ థియేట్రికల్ ట్రైలర్ విడుదలకు రెడీగా ఉంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్, పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ఈ మూవీలో రొమాన్స్ తో పాటు హృదయాన్ని హత్తుకునే సెంటిమెంట్ కూడా ఉంది అన్న విషయం నాన్న సెంటిమెంట్ తో విడుదలైన సాంగ్ తో అర్థం అవుతుంది.నేషనల్ క్రష్ రష్మిక మందన్న, బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కాంబో లో థాంక్యూ ఎక్కుతున్న ఈ మూవీకి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నారు.
తెలుగులో అర్జున్ రెడ్డి అనే సినిమాతో మొదటి సారి ఊహించని బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఇక ఆ తర్వాత ఇదే సినిమాని హిందీలో కబీర్ సింగ్ అనే పేరుతో తీసి బాలీవుడ్ లో కూడా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పటికి అతను తీసినవి రెండు మూవీస్ అయినప్పటికీ అటు బాలీవుడ్..ఇటు టాలీవుడ్ ..రెండు దగర్ల అతను తీసే చిత్రాల పై విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో విడుదలవుతున్న అతని రీసెంట్ మూవీ యానిమల్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ చిత్రం డిసెంబర్ 1న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం వెరైటీగా ప్రమోషన్స్ తో మూవీ పై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన మరొక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ గురించిన అప్డేట్ ను పోస్టర్ ద్వారా వెల్లడించారు.యానిమల్ ట్రైలర్ నవంబర్ 23 న విడుదల చేయబోతున్నట్లు అతను పోస్టర్ ద్వారా కన్వే చేశారు. ఈ పోస్టర్ లో డైరెక్టర్ సందీప్..హీరో రణబీర్ తో కలిసి ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ గా ఉంది.