
Team India : టీమ్ ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఓటమిపై ప్రముఖులు స్పందిస్తున్నారు. అయితే ఏ ఒక్కరు కూడా ఓడిపోయారని మాత్రం చెప్పడం లేదు. టీమ్ ఇండియా గొప్పగా ఆడిందని కితాబిస్తున్నారు. మరి వారేమన్నారో ఒకసారి చూద్దాం..
సోషల్ మీడియా ఫ్రెండ్లీగా ఉండే పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ…జీవితంలో ముందుకు సాగాలంటే ఓటమిని కూడా అంగీకరించాలని అన్నారు. ఈ సత్యం నేర్చుకున్నానని తెలిపారు. ఇటువంటి సమయంలో భారత క్రీడాకారులకి మనం అందరం అండగా ఉండాలని అన్నారు.
ఈ వరల్డ్ కప్ లో టీమిండియా అనుకున్న దానికంటే అద్భుతంగా రాణించిందని అన్నారు. అందుకు మనం వారిని అభినందించాలని అన్నారు. అలాగే ఒక ఫొటో కూడా పోస్ట్ చేశారు. అందులో ఒక వ్యక్తి ఒంటరిగా ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్టుగా ఉంది. మరో అవకాశం కోసం, మరో అద్భుతం కోసం మనమూ అలాగే ఎదురుచూద్దాం అంటూ కామెంట్ చేశారు. బిజినెస్ టైకూన్ సూచనపై వెంటనే చాలామంది స్పందించారు. వెంటనే వెల్ ప్లేయిడ్ టీమ్ ఇండియా అంటూ పోస్టులు పెట్టారు.
బాలీవుడ్ విలక్షణ నటుడు బొమన్ ఇరానీ మాట్లాడుతూ వరల్డ్ కప్ ఆద్యంతం టీమ్ ఇండియా బాగా ఆడింది…ఫైనల్ రోజు మాత్రం ఆస్ట్రేలియా బాగా ఆడిందని కామెంట్ చేశారు.
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ టీమ్ ఇండియా అద్భుతంగా ఆడింది. వరల్డ్ కప్ 2023 మెగా టోర్నమెంట్ లో మీరు తల ఎత్తుకుని నిలబడేలా చేసింది. మీతో కలిసి ఇన్నాళ్లు చేసిన ప్రయాణంలో మాకెన్నో మరపురాని ఆనందాలను అంజేసినందుకు ధన్యావాదాలు అని పోస్ట్ చేశారు.
వివేక్ ఓబరాయ్ మాట్లాడుతూ నిజంగా టీమ్ ఇండియా వరల్డ్ కప్ లో ఆడిన ఆటకి నేను పెద్ద ఫాన్ అయిపోయాను. ఇంతగొప్పగా పెర్ ఫార్మెన్స్ ఇచ్చిన టీమ్ ఇండియాకు అభినందనలు అని అన్నారు.
టాలీవుడ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ముందుగా ఆస్ట్రేలియాకి అభినందనలు, అలాగే టీమ్ ఇండియాకు కూడానని తెలిపారు. ఎందుకంటే ఆద్యంతం అద్భుతంగా టీమ్ ఇండియా ఆడింది. మీ ఆటను చూసి ఒక ఇండియన్ గా నేను గర్వపడుతున్నానని తెలిపారు.
టాలీవుడ్ యువ హీరో, మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ ఒక పోస్ట్ పెట్టారు. ఒక గొప్ప క్రమశిక్షణతో కూడిన టీమ్ వర్క్ ను టీమ్ ఇండియాలో చూశాను. టోర్నమెంట్ ఆద్యంతం అద్భుతంగా ఆడారు. ఇది ఒక్క రాత్రిలో జరిగింది కాదు. భారతీయులందరి హృదయాలను మాత్రం గెలుచుకున్నారని అన్నాడు.
వెల్ ప్లేయిడ్ టీమ్ ఇండియా అంటూ లక్షలాది పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చూశారు కదండీ..మన ఇండియాది ఓటమి కాదు…ఆటలో సహజంగా జరిగే గెలుపోటములు మాత్రమే. ఇక్కడ ఎవరో ఒకరు గెలవాలి, మరొకరు ఓడాలి. ఇంతవరకు గెలుపు మన పక్షాన నిలిచింది. ఈ ఒక్కరోజు మాత్రం అటు వెళ్లిందని అంటున్నారు.