Animal Movie : 100 కోట్ల టార్గెట్ తో.. టాలీవుడ్ బరిలో యానిమల్..

Animal Movie : 100 కోట్ల టార్గెట్ తో.. టాలీవుడ్ బరిలో యానిమల్..

animal
Share this post with your friends

animal

Animal Movie :బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక కాంబోలో సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న యానిమల్ మూవీ త్వరలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ , సాంగ్స్ మూవీ పై మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం ఫస్ట్ గ్లిమ్ప్స్.. టీజర్ అంచనాలను భారీగా పెంచాయి. డిసెంబర్ 1న ఈ చిత్రం గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ ని భారీగా పెంచేశారు. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ ఏ స్టైల్ లో ఉంటుందో అర్జున్ రెడ్డి మూవీ చూసిన ఎవరికైనా సులభంగా అర్థం అవుతుంది. ఇదే మూవీ ని షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ గా రీమేక్ చేయడం వల్ల అక్కడ కూడా అతనికి మంచి డిమాండ్ ఉంది. కబీర్ సింగ్ ప్రమోషన్స్ అప్పుడు మరీ ఇంత వైలెంట్ గా మూవీ తీసారే అని అడిగిన దానికి సందీప్ ఈ మూవీలో ఏం చూసారు.. వైలెన్స్ అంటే ఎలా ఉంటుందో నెక్స్ట్ మూవీ లో చూపిస్తాను అని సమాధానం ఇచ్చాడు.

అన్న మాట ప్రకారం.. ఈ మూవీ టైటిల్ కి తగినట్టుగానే ఇందులో వైలెన్స్ నిజంగానే భయంకరంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఆ విషయం పక్కన పెడితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ ప్రోగ్రాం కి హీరో హీరోయిన్లతో కలిసి సందీప్ రెడ్డి వంగా కూడా వచ్చాడు. ఇక ఇందులో బాలయ్య చేసిన సందడి ఓ రేంజ్ లో ఉండగా.. రణబీర్ కపూర్ నోటి వెంట బాలయ్య డైలాగ్ మరింత హైలెట్గా నిలిచింది. ఒకప్పుడు టాలీవుడ్ ని చాలా చిన్న చూపు చూసే బాలీవుడ్ హీరోలు ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ విలువ తెలుసుకొని ప్రమోషన్స్ కోసం టాలీవుడ్ కి రాక తప్పడం లేదు.

రణబీర్ కపూర్ ఇంతకుముందు చేసిన బ్రహ్మాస్త్ర సినిమా వల్ల కాస్త టాలీవుడ్ కు కూడా పరిచయమయ్యాడు. ఇక ఈ మూవీ తెలుగు ప్రమోషన్స్ లో కూడా రణబీర్ కపూర్ పాల్గొన్నాడు. ఇప్పుడు రాబోయే తన నెక్స్ట్ మూవీ యానిమల్ మూవీ ప్రమోషన్స్ లో కూడా యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. బాలీవుడ్ సినిమాలకు తెలుగులో మార్కెట్ విలువ బాగానే ఉంది. షారుక్ ఖాన్ జవాన్ చిత్రం తెలుగులో సుమారు 70 కోట్ల అత్యధిక వసూళ్లను నమోదు చేసింది. దీంతో సందీప్ తన మూవీకి 100 కోట్లు అయినా వసూలు అవుతుంది అని భావిస్తున్నట్లు అంచనా.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest Gold Rates: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

Bigtv Digital

CM KCR: కేసీఆర్ నోట చంద్రబాబు మాట.. ప్రచారానికి వాడేసుకున్న సీఎం.. రేవంత్ కౌంటర్..

Bigtv Digital

Hi Nanna  : హాయ్ నాన్న సెన్సార్ కంప్లీట్..లెంగ్త్ ఏంటో తెలుసా?

Bigtv Digital

Rahul Gandhi Speech: ఇందిరమ్మ ఇళ్ల పథకం.. రాహుల్ హామీ..

Bigtv Digital

Khushbu Sundar : 8 ఏళ్ల వ‌య‌సులో క‌న్న తండ్రే లైంగికంగా వేధించాడు..ఖుష్బూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Bigtv Digital

YS Sharmila : షర్మిలకు బెయిల్ .. షరతులు వర్తిస్తాయ్..

Bigtv Digital

Leave a Comment