IND vs NZ : ఉత్కంఠ పోరులో ఇండియా ఘనవిజయం.. పోరాడి ఓడిన కివీస్..

IND vs NZ : ఉత్కంఠ పోరులో ఇండియా ఘనవిజయం.. పోరాడి ఓడిన కివీస్..

IND vs NZ
Share this post with your friends

IND vs NZ

IND vs NZ : భూమి గుండ్రంగా తిరుగుతుందన్నట్టుగా టీమ్ ఇండియా కొట్టిన కొట్టుడికి గ్రౌండ్ నలువైపులా బాల్ పరుగులు పెట్టింది. చివరికి హైవోల్టేజ్ మ్యాచ్ లో టీమ్  ఇండియా విజయం సాధించింది.కింగ్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ 50వ సెంచరీ, శ్రేయాస్ సుడిగాలి సెంచరీ, రోహిత్ శర్మ కెప్టెన్సీ, మహ్మద్ షమీ 7 వికెట్లు వెరసీ ఇండియాని సెమీస్ గండం దాటించి ఫైనల్ ముందు ఉంచింది..వరుసగా 9 మ్యాచ్ లు గెలిచిన ఇండియా గెలుపు గాలివాటం కాదని నిరూపించారు.  

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 398 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ 327 పరుగులకి ఆలౌట్ అయ్యింది. దీంతో 70 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ఓపెనర్లు బ్రహ్మాండమైన స్టార్టింగ్ ఇచ్చారు. ముఖ్యంగా రోహిత్ శర్మ  29 బాల్స్ లో చేసిన 47  చేసిన పరుగులు మ్యాచ్ ని గేర్ అప్ చేసింది. ఇందులో 4 సిక్స్ లు, 4 ఫోర్లు ఉన్నాయంటే ఎంత విధ్వంసకరంగా ఆడాడో చూడాల్సిందే.  8.2 ఓవర్లలో 71 పరుగుల దగ్గర రోహిత్ అవుట్ అయ్యాడు.

అప్పుడు కింగ్ కోహ్లీ వచ్చాడు. టిమ్ సోథీ బౌలింగ్ లో తనెదుర్కొన్న రెండో బాల్ కి అవుట్ అయిపోయేవాడే. బ్యాట్ కి తగిలి బాల్ వెళ్లిపోయింది. అయితే కివీస్ డీఆర్ఎస్ తీసుకుంది. అందులో నాట్ అవుట్ అని రావడంతో ఊపిరి పీల్చుకున్న కోహ్లీ జాగర్త పడిపోయాడు. ఇక ఎప్పటిలాగే సింగిల్స్, డబుల్స్ తీస్తూ  లూజ్ బాల్స్ వచ్చినప్పుడు ఫోర్లు, సిక్సర్లు కొడుతూ  రన్ రేట్ 7కి తగ్గకుండా స్కోరు బోర్డుని పరుగెత్తించాడు.

ఈ సమయంలో మరో ఎండ్ లో శుభ్ మన్ గిల్ స్కోర్ పెంచే బాధ్యతను తీసుకున్నాడు. సరిగ్గా 79 పరుగుల దగ్గర గాయం కావడంతో రిటైర్డ్ హర్ట్ లా పెవిలియన్ చేరాడు. అప్పటికి బ్రహ్మాండంగా ఆడుతున్న గిల్ సెంచరీ చేస్తాడనుకుంటే, తను ఇలా వెళ్లిపోవడంతో అంతా బాధపడ్డారు. అప్పుడొచ్చాడు శ్రేయాస్ అయ్యర్.. బ్యాట్ ఝులిపించినప్పుడు మాత్రం వాళ్లూ వీళ్లని చూడేలేదు. దొరికినోడిని దొరికినట్టు చాకి రేవు పెట్టేశాడు. ఈ క్రమంలో 70 బంతుల్లో 105 పరుగులు చేసి వరల్డ్ కప్ లో రెండో సెంచరీ నమోదు చేశాడు.

మ్యాచ్ ని ఇండియావైపునకు తిప్పేశాడు. ఈ క్రమంలో కోహ్లీ వన్డేల్లో హయ్యస్ట్ సెంచరీలు సాధించిన సచిన్ రికార్డు 49 ని దాటేశాడు. 50 వ సెంచరీ చేసి శభాష్ అనిపించాడు. సెంచరీ కాగానే తన గురువు, క్రికెట్ ఆరాధ్య దైవమైన సచిన్ టెండూల్కర్ కి నమస్కరించాడు. అప్పుడు స్టేడియంలోనే ఉన్న సచిన్ క్లాప్స్ కొడుతూ కోహ్లీని అభినందించాడు.

చివరికి 43.6 ఓవర్ దగ్గర 117 పరుగులు చేసిన కోహ్లీ అవుట్ అయ్యాడు. అప్పటికి స్కోరు రెండు వికెట్ల నష్టానికి 327 పరుగులతో ఉంది. తర్వాత కేఎల్ రాహుల్ 20 బంతుల్లో 39 పరుగులు చేసి నాటౌట్ నిలిచాడు. ఇలా అందరూ తలా ఒక చేయివేయడంతో ఇండియా 397 పరుగుల భారీ స్కోరు చేసింది. కివీస్ బౌలింగ్ లో ట్రెంట్ బోల్ట్ 1, టిమ్ సౌథి 3 వికెట్లు తీసుకున్నారు.

తర్వాత బ్యాటింగ్ కి దిగిన న్యూజిలాండ్ ఒకదశలో ఇండియాని వణికించింది. మెయిన్ బౌలర్స్ బుమ్రా, సిరాజ్ లకు వికెట్లు రాకపోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఏం చేశాడంటే మరో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని తీసుకొచ్చాడు. తను వేసిన మొదటి ఓవర్ మొదటి బంతికే  ఒపెనర్ డేవన్ కాన్వే (13) వికెట్ తీశాడు. ఇంక అక్కడ నుంచి ఆగలేదు. రెండో ఓవర్ లో యువ సంచలనం రచిన్ రవీంద్ర (13) వికెట్ తీశాడు. దీంతో కివీస్ 39 పరుగులకి రెండు వికెట్లు నష్టపోయి గిలగిల్లాడుతోంది. అప్పటికి 7.4 ఓవర్లు మాత్రమే అయ్యాయి.

తర్వాత  విలియమ్సన్ (69), డేరిల్ మిచెల్ (134) జట్టుని ఆదుకున్నారు. 20 ఓవర్లకు ఇండియా ఎంత స్కోరు చేసిందో, కివీస్ కూడా అంతే స్కోర్ మీద ఉండేది. దీంతో ఇద్దరి మధ్య టైట్ ఫైట్ జరిగింది. టెన్షన్ హై ఓల్టేజీ మీద నడిచింది.

అయితే టీవీల దగ్గర భారతీయులు మాత్రం  ఊపిరి బిగబట్టి చూడటం మొదలుపెట్టారు. మరో వికెట్ పడుతుందా? లేదా? అని ఆత్రతగా ఎదురు చూశారు. ఈ సమయంలో విలియమ్సన్ ఇచ్చిన క్యాచ్ ని షమీ వదిలేశాడు. దీంతో అందరూ ఉసూరుమన్నారు.

అది జరిగిన రెండు ఓవర్ల తర్వాత షమీ బౌలింగ్ కి వచ్చాడు. వచ్చిన వెంటనే ఒకే ఓవర్ లో కెప్టెన్ విలియమ్సన్ (69), టామ్ లాథమ్ (0) అవుట్ అయిపోయారు. దాంతో నాలుగు వికెట్లు కోల్పోయిన కివీస్ 220 పరుగులతో నిలిచింది. అప్పటికి 32.4 ఓవర్లు అయ్యాయి. మ్యాచ్ ఇండియా వైపు తిరిగింది. ఆ తర్వాత డేరీ మిచెల్ (134), గ్లెన్ ఫిలిప్స్ (41) పోరాడారు. కానీ బూమ్రా ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. ఫిలిప్స్ లాంగ్ ఆన్ లో జడేజాకి దొరికి పోయాడు. ఆ తర్వాత కుల్దీప్ బౌలింగ్ లో చాప్ మన్ అయిపోయాడు.

ఆ వెంటనే మళ్లీ షమీ బౌలింగ్ కి వచ్చి మిగిలిన మూడు వికెట్లు తీసి…కివీస్ ను ఇంటికి పంపించాడు.మొత్తం ఏడు వికెట్లు తీసి ఇండియాను ఫైనల్ ముంగిట నిలిపాడు. చివరికి 48.5 ఓవర్లో 327 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.’

టీమ్ ఇండియా బౌలర్లలో సిరాజ్ 1, మహ్మద్ షమీ 7, బుమ్రా 1, కుల్దీప్ 1 వికెట్టు తీసుకున్నారు. మొత్తానికి సెమీస్ ముంగిట్లో ఇండియా ఘన విజయం సాధించి ఫైనల్ వైపు దూసుకు వెళ్లింది.

.

.

.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

TDP : టీడీపీ, జనసేన పొత్తు కుదిరినట్టే..మరి బీజేపీ సంగతేంటి?

Bigtv Digital

Parigi Hospital : ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ రాసలీలలు!

Bigtv Digital

Israel-Gaza War : గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ మద్దతుతో పోరాటంలోకి హమాస్

Bigtv Digital

Rashmika Mandanna : హాట్ ఫొటోలు లీక్.. సోషల్ మీడియాలో వైరల్.. రష్మిక రియాక్షన్ ..

Bigtv Digital

Heroines: ప్రాణాంతక వ్యాధులు.. ధైర్యంతో పోరాటం.. చివరికి..!

Bigtv Digital

TSPSC: 100 కోట్లు కడతారా? సారీ చెబుతారా?.. కేటీఆర్ లీగల్ నోటీస్

Bigtv Digital

Leave a Comment