BigTV English

Dasara 2 : దేవిశ్రీని పక్కన పెట్టిన నాని… ముచ్చటగా మూడోసారి ఆ పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ కోసం ప్రయత్నాలు

Dasara 2 : దేవిశ్రీని పక్కన పెట్టిన నాని… ముచ్చటగా మూడోసారి ఆ పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ కోసం ప్రయత్నాలు

Dasara 2 : ‘దసరా’ మూవీ ఇచ్చిన జోష్ తో నేచచునల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో వరుసగా మూడు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న నాని మరోసారి ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో కలిసి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో మేకర్స్ ఓ పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ కోసం ప్రయత్నిస్తున్నారనేది తాజా సమాచారం. మరి ఆ ప్లాన్ ఇండియా డైరెక్టర్ ఎవరో చూసేద్దాం పదండి.


పాన్ ఇండియా డైరెక్టర్ ఫిక్స్ ?

నేచురల్ స్టార్ నాని గతేడాది మార్చిలో రిలీజ్ అయిన ‘దసరా’ మూవీతో తన కెరీర్ లోనే ఓ మైల్ స్టోన్ హిట్ మూవీని అందుకున్నారు. అప్పటిదాకా హోమ్లి గా కనిపించిన నాని ‘దసరా’ మూవీతో మాస్ హీరోగా కొత్త అవతారం ఎత్తాడు. ఈ సినిమాతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లో కూడా చేరాడు. అయితే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా మొదటి చిత్రమే అయినప్పటికి ఒక డెబ్యూ డైరెక్టర్ లా కాకుండా తొలి ప్రయత్నంలోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఈ మూవీ రిలీజ్ అయ్యి ఏడాది పూర్తయ్యాక శ్రీకాంత్ ఓదెల తన నెక్స్ట్ మూవీని మళ్ళీ నానితోనే చేయబోతున్నానని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. అంతేకాదు సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమా ప్రొడక్షన్స్ పై నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ రిపీట్ కాబోతోందని ప్రకటించారు. ఈ సినిమాకు #NaniOdel2 అనే వర్కింగ్ టైటిల్ ని ఫిక్స్ చేసి ఇదొక యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతోందని వెల్లడించారు. సెప్టెంబర్ 18న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది.


ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా సంగీతం విషయంలో రోజుకో మ్యూజిక్ డైరెక్టర్ పేరు తెరపైకి వస్తుంది. ‘దసరా’ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, ఈ సీక్వెల్ కి మాత్రం నిన్న మొన్నటిదాకా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తారని టాక్ నడిచింది. కానీ తాజా సమాచారం ప్రకారం చిత్ర బృందం రీసెంట్ గా మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో సంప్రదింపులు జరిపారని, ఇప్పటికే ఆయన సినిమాకు సైన్ చేశాడని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.

ముచ్చటగా మూడోసారి నానితో…

అయితే నాని సినిమాకు అనిరుధ్ సంగీతం అందించడం అనేది ఇదే మొదటిసారి కాదు. 2019లో నాని హీరోగా నటించిన జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలకు ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. ఇక ఆ తర్వాత ఈ డైరెక్టర్ కెరీర్ ఓ రేంజ్ లో మలుపు తిరిగింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి 130 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న నాని సినిమాకు ఆయన సంగీతం అందిస్తుండడం విశేషం. కాగా ప్రస్తుతం నాని ‘హిట్ : ది థర్డ్ కేస్’ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×