Ram Charan VS Allu Arjun: గత కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీలో విభేదాలు మొదలయ్యాయి అనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అందుకే మెగా హీరోల ఫ్యాన్స్ కూడా చీలిపోయారు. ఒకరి సినిమాపై ఒకరు ట్రోల్స్ చేయడం మొదలుపెట్టేశారు. ముఖ్యంగా మెగా హీరోలంతా ఒకవైపు, అల్లు అర్జున్ మాత్రమే ఒకవైపు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పుడు మెగా హీరోలు అయినా రామ్ చరణ్, అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా సినిమాలతో రెడీగా ఉన్నారు. పైగా ఈ రెండు సినిమాల కోసం ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భాన్నే క్యాష్ చేసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే ‘గేమ్ ఛేంజర్’ వర్సెస్ ‘పుష్ప 2’ అనే పోటీ మొదలయ్యింది.
గేమ్ ఛేంజర్ వర్సెస్ పుష్ప
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న చిత్రమే ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా దాదాపుగా రెండేళ్ల నుండి ఎదురుచూస్తున్నారు. మధ్యలో ఈ సినిమా అసలు ఉండదేమో అని కూడా ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ గురించి ఎవరు ఎన్నిసార్లు అడిగినా టీమ్ నుండి రెస్పాన్స్ లేదు. అలాంటిది ‘గేమ్ ఛేంజర్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది అంటూ నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. సంక్రాంతికి సినిమా వస్తుందని పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇక తాజాగా ‘గేమ్ ఛేంజర్’ టీజర్ థీమ్ అంటూ ఒక పోస్టర్ విడుదలయ్యింది. అదే సమయానికి పుష్పగాడు రంగంలోకి దిగాడు.
Also Read: చరణ్ ను కాపీ కొడుతున్న బన్నీ..?
అదే ఇంట్రెస్టింగ్
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రమే ‘పుష్ప 2’ (Pushpa 2). ఇప్పటికే ‘పుష్ప’ విడుదలయ్యి మూడేళ్లు అయ్యింది. అప్పట్లో దీని సీక్వెల్‌పై క్రేజ్ మామూలుగా లేదు. కానీ మెల్లగా దీని సీక్వెల్‌కు షూటింగ్ లేట్ అవ్వడం, అస్సలు అప్డేట్స్ లేకపోవడం వల్ల ఆడియన్స్‌లో కూడా హైప్ తగ్గిపోయింది. దానిని మేకర్స్ గమనించారు. అందుకే డిసెంబర్ 6న విడుదల కావాల్సిన ‘పుష్ప 2’.. డిసెంబర్ 5నే విడుదల కానుందని ప్రకటించారు. అప్పటినుండి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. అలాగే ‘పుష్ప 2’ ట్రైలర్ అప్డేట్‌ను పోస్టర్‌తో బయటపెట్టారు మేకర్స్. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది.
మజా ఇచ్చే పోటీ
‘గేమ్ ఛేంజర్’ టీజర్ థీమ్ పోస్టర్, ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ పోస్టర్ ఒకేసారి విడుదలయ్యాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఒకే టైమ్‌లో బయటికొచ్చాయి. దీన్ని బట్టి చూస్తే రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ అనే పోటీ మొదలయ్యిందా అని అనుమానం మొదలయ్యింది. అయితే ఈ ఇద్దరు హీరోలు ముఖ్యంగా నార్త్‌లో తమ సత్తా చాటుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ‘గేమ్ ఛేంజర్’ టీజర్ లాంచ్ కోసం రామ్ చరణ్ లక్నో వెళ్లగా.. ‘పుష్ప 2’ ట్రైలర్ లాంచ్ కోసం అల్లు అర్జున్ పాట్నా బయల్దేరనున్నాడు. మొత్తానికి ఈ ఇద్దరు మెగా హీరోల మధ్య ఈ పోటీ మజా వచ్చేలా ఉందని ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.