BigTV English

Review: ‘అన్నీ మంచి శకునములే’.. సినిమాకు శకునం బాగుందా?

Review: ‘అన్నీ మంచి శకునములే’.. సినిమాకు శకునం బాగుందా?
Anni_Manchi_Sakunamule_Review_Rating

Review: ‘అన్నీ మంచి శకునములే’. టైటిల్ కూల్‌గా ఉంది. డైరెక్టర్ నందినిరెడ్డి అనగానే ఆసక్తి పెరిగింది. ప్రియాంక దత్ నిర్మాత కావడంతో మరింత హైప్. ‘స్వప్న సినిమా’ ఖాతాలో మంచి హిట్లు ఉండటంతో.. భారీ అంచనాలతో మూవీ రిలీజ్ అయింది. పేరుకు తగ్గట్టు.. సినిమా శకునం బాగుందా? సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ జంట హిట్ కొట్టిందా?


స్టోరీ: ట్రైలర్‌లో చూపించినట్టే కథతో.. విక్టోరియాపురం అనే ఊరు, కె.జి.కాఫీ ఎస్టేట్. అక్కడి కాఫీకికి ఫుల్ డిమాండ్. ఆ ఎస్టేట్ కోసం ప్రసాద్‌ (రాజేంద్ర ప్రసాద్‌), దివాకర్‌ (రావు రమేష్‌) కుటుంబాల మధ్య కోర్టు కేసు నడుస్తుంటుంది. దివాకర్‌ తమ్ముడు సుధాకర్‌ (నరేష్‌) కొడుకు రిషి (సంతోష్‌ శోభన్‌).. ప్రసాద్‌ కూతురు ఆర్య (మాళవిక నాయర్‌)లు.. ఖుషీ సినిమా స్టైల్‌లో ఒకేరోజు ఒకే ఆస్పత్రిలో పుడతారు. కానీ, ఆస్పత్రి సిబ్బంది చేసిన పొరపాటు వల్ల పిల్లలు తారుమారవుతారు. ప్రసాద్‌ కొడుకుగా రిషి.. సుధాకర్‌ కూతురిగా ఆర్య పెరిగి పెద్ద వాళ్లవుతారు. ఆర్యతో వన్ సైడ్ లవ్‌లో ఉంటాడు రిషి. ఎప్పుడు ఐ లవ్ యూ చెబుదామన్నా ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంటుంది. ఓసారి బిజినెస్‌ పని మీద యూరప్‌ వెళ్తారు. అక్కడ గొడవ పడతారు. విడిపోతారు. ఆ తర్వాత ఏమైందనేది మెయిన్ స్టోరీ.

ఎలా ఉందంటే: ఆర్య, రిషిల ప్రేమకథను మరీ సాగదీశారు. కొన్ని సీన్లు బాగున్నా.. చాలా సీన్లు బోర్ కొట్టించేలా ఉన్నాయి. హీరో, హీరోయిన్ల మధ్య ఇగో క్లాష్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. ఇక, బోలెడన్ని క్యారెక్టర్స్‌తో టీవీ సీరియల్స్ మాదిరి స్టోరీ నడింపించినట్టు ఉంది. క్లైమాక్స్‌లో ఎమోషన్స్ బాగా టచ్ చేశారు. అయితే, ఎక్కడా కథకు బలాన్నిచ్చే మెయిన్ ట్రాక్ కనిపించకపోవడం మైనస్. అందుకే, కొత్తదనం లేని రొటీన్ సినిమాగానే మిగిలిపోయింది ‘అన్నీ మంచి శకునాలే’. మిక్కీ జె.మేయర్‌ సినిమాకు తగ్గ మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాణ పరంగా బాగుంది. స్టోరీనే.. స్లో అండ్ రొటీన్.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×