
Sampath J Ram:- కన్నడ సీరియల్ హీరో సూసైడ్ చేసుకున్నాడు. అగ్నిసాక్షి సీరియల్‌లో టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సంపత్ జె రామ్ బెంగళూరులోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎప్పటికైనా సినీ హీరో కావాలని ఇండస్ట్రీలోకి వచ్చిన సంపత్… ఈ గ్యాప్‌లో సీరియల్స్‌లో నటిస్తున్నాడు. ఎంత ప్రయత్నించినా.. హీరో అవకాశాలు రాకపోవడంతో.. కొంతకాలంగా డిప్రెషన్లో ఉన్నట్టు సంపత్ స్నేహితులు చెబుతున్నారు. ఆ కారణంతోనే సంపత్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని చెబుతున్నారు.
ఈ మధ్య బుల్లితెర నటుల వరుస ఆత్మహత్యలు కలవర పెడుతున్నాయి. ఈ మధ్యే హైదరాబాద్ పుప్పలగూడ పరిధిలోని ఆల్కాపురి కాలనీలో ప్రముఖ టీవీ సీరియల్ నటుడు ప్రదీప్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రదీప్ ఈమధ్యే బుల్లితెర నటి పావని రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. ప్రదీప్ కుమార్ ఆత్మహత్యతో తెలుగు సీరియల్ ఇండస్ట్రీ షాక్ అయింది.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో కూడా టెలివిజన్ నటి తునీషా శర్మ సూసైడ్ చేసుకుంది. సెట్‌లోని వాష్‌రూమ్‌కి వెళ్లి ఎంతసేపటికి తిరిగి రాలేదు. తలుపులు పగులగొట్టి చూడగా లోపల ఉరి వేసుకుని కనిపించింది. తునీషా శర్మ సీరియల్ సెట్‌లోనే ఆత్మహత్య చేసుకోవడంతో అంతా షాక్ అయ్యారు.
మరో టీవీ సీరియల్ నటి వైశాలి ఠక్కర్.. మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. 29 ఏళ్ల వైశాలి ఠక్కర్‌ను తన తోటి వారే వేధించారని పోలీసులు చెబుతున్నారు. స్పాట్‌లో దొరికిన సూసైడ్ లెటర్‌పై దర్యప్తు జరుగుతోంది.
అవకాశాలు రాకపోవడం, డిప్రెషన్, ఇంటి వ్యవహారాల్లో ఒత్తిడి, వేధింపులు… కారణం ఏదైనా గానీ సీరియల్ నటులు ఇలా ఆత్మహత్య చేసుకోవడం కలవరం రేపుతోంది.