BigTV English

Perni Nani: అధికారుల వైసీపీ భక్తి.. పేర్ని నాని కేసు క్లోజేనా..?

Perni Nani: అధికారుల వైసీపీ భక్తి.. పేర్ని నాని కేసు క్లోజేనా..?

Perni Nani: రాజకీయంగా సంచలనం సృష్టించిన రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసుల దర్యాప్తు తీరు.. దర్యాపు అధికారిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని వ్యవహారంలో పోలీసులు చెప్పేదొకటి గ్రౌండ్‌లెవల్లో జరుగుతుంది ఒకటి అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అనుమానాలకు అధికారుల గత చరిత్రే కారణమంటున్నారు. కేసు నమోదు చేసి 15 రోజులవుతున్నా.. దర్యాప్తు ఒక్క అడుగు పడకపోగా.. పోలీసుల నుంచి ప్రభుత్వ న్యాయవాదికి సహకరించడం లేదు. దాంతో అధికారులు ఇంకా వైసీపీ విధేయులుగానే ఉన్నారంటున్నారు. పేర్ని నాని ఫ్యామిలీ పరారయ్యాక పోలీసులు తాపీగా వెళ్లి ఆయన ఇంటికి నోటీసులు అంటించడం ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తుంది.


ఏపీలో పేదలకు పంచే రేషన్ బియ్యం అక్రమ దందా వ్యవహారం పెద్ద దుమారం రేపుతున్న టైమ్‌లో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన మచిలీపట్నం గోడౌన్లో 187 టన్నుల రేషన్ బియ్యం లో తేడాలు రావడంపై రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. రేషన్ దందాపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన ఘటన మరిచిపోక ముందే తమ గోడౌన్‌లో 187 టన్నుల బియ్యం తగ్గాయని.. అందుకు సంబంధించిన లెక్కలు ఎంతో చెప్తే చెల్లిస్తామని గోడౌన్ యజమాని పేర్ని నాని భార్య పేర్ని జయసుధ కృష్ణా జిల్లా జెసి గీతాంజలి శర్మకు లేఖ రాసి, పెనాల్టీ చెల్లించారు. రెండు విడతలుగా కోటి డెబ్బై లక్షల రూపాయలు పెనాల్టీ చెల్లించిన పేర్ని నాని కుటుంబం చేసిన తప్పును ఒప్పుకున్నట్లైంది.

రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని కుటుంబం పరారీలో ఉంది. పోలీసుల నోటీసులపై పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు పేర్ని నాని భార్య జయసుధపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆమె కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. 15 రోజులుగా పేర్ని నాని భార్య జయసుధ అజ్ఞాతంలోనే ఉన్నారు. కేసు దర్యాప్తుగా సహకరించాల్సిందిగా తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే మచిలీపట్నంలోని మాజీ మంత్రి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించి వచ్చారు. అయితే గత వారం పేర్ని నాని తన నివాసంలో ప్రత్యక్షమవ్వడం చర్చనీయాంశంగా మారింది. పెనాల్టీ కట్టేయడంతో ఇక కేసు నుంచి బయట పడవచ్చన్న ధీమాతోనే ఆయన బయటకు వచ్చారన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఆయన వెంటనే మాయమవ్వడం పలు అనుమానాలకు తావిస్తుంది.


ఇంతవరకు పేర్ని నాని కుటుంబం స్పందించకపోవడంతో వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టామంటున్నారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో నిందితులుగా పేర్ని నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజా కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా మానస కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడూ చట్టం గురించి నీతులు చెప్పే పేర్ని నాని.. ఇప్పుడు చట్టంలో ఆటలాడుతున్నారని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు.

Also Read: పేర్ని నాని సేఫ్.. కేసు క్లోజ్?

రేషన్ బియ్యం అక్రమాల గురించి రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది. ఈ క్రమంలోనే కృష్ణాజిల్లా మచిలీపట్నంలో కోటి రూపాయల రేషన్ బియ్యం స్వాహా చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ విషయంలో పేర్ని నాని చిక్కుల్లో పడ్డారు. రేషన్ బియ్యం మాయంపై పేర్నినాని సతీమణి జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజపై కూడా కేసు నమోదైంది. జగన్ ప్రభుత్వ హయాంలో నాని సతీమణి పేరిట గోడౌన్ నిర్మించి సివిల్ సప్లై శాఖకు అద్దెకు ఇచ్చారు. ఆ క్రమంలోనే పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టింది. దీంతో పేర్ని నాని అధికార దుర్వినియోగానికి పాల్పడి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

కేసు నమోదైనప్పటి నుంచి పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. వారిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. అయితే ఈ కేసులో పోలీసులు చెప్పేదొకటి క్షేత్రంలో జరుగుతున్నది మరొకటి. ఈ అనుమానాలకు అధికారుల గత చరిత్రే కారణం. కేసు నమోదు చేసి 15 రోజులవుతున్నా.. దర్యాప్తు ఒక్క అడుగు ముందుకు పడకపోగా.. పోలీసుల నుంచి ప్రభుత్వ న్యాయవాదికి సహకారం లేనట్లు తెలిసింది. అధికారులు ఇంకా వైసీపీవిధేయులుగానే ఉన్నారనే విమర్శలున్నాయి. మాజీ మంత్రి ఇటీవల తన నివాసంలో సమాలోచనలు జరిపితే.. మౌనం దాల్చిన పోలీసులు అకస్మాత్తుగా శనివారం రాత్రి నోటీసులు పట్టుకుని ఆయన ఇంటికెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో విచారణకు రావాలని ఇంటికి నోటీసులు అంటించి రావడం గమనార్హం.

బియ్యం మాయం కేసుపై మాట్లాడిన టీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు పోలీసులు సెల్‌ఫోన్లో బెదిరిస్తున్నారంట. ఇటీవల ప్రెస్‌మీట్‌ పెట్టిన ఒక నేతకు ఫోన్‌ చేసి పోలీసుల గురించి మాట్లాడతావా అని బెదిరిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. బియ్యం మాయంపై ఈనెల 11న తాలూకా ఠాణాలో వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాక పోలీసులు ఏంచేశారనేది గోప్యమని ఎస్పీ చెబుతున్నారు. ఒక్క లుక్‌ ఔట్‌ నోటీసు జారీ తప్ప.. మూడు బృందాల నియామకం మినహా ఒక్క అడుగు ముందుకు పడలేదు. కనీసం ప్రయత్నం చేయలేదు. ఈ కేసు దర్యాప్తు అధికారి అయిన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సర్వీసు అంతా గుడివాడలోనే సాగిందంట. ఆయన కొడాలి నానికి ప్రియ శిష్యుడనే పేరుంది. ఈ దర్యాప్తు అధికారి సీడీ ఫైల్‌ పీపీకి ఇవ్వలేదు. కనీసం సహకరించట్లేదని చెబుతున్నారు. గోదాము యజమాని, పేర్ని నాని భార్య ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేస్తే.. పీపీ వాయిదాలు కోరడం విశేషం.

కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్‌.. వైసీపీ జమానాలో అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసు నమోదు చేసిన వ్యక్తి. ఆయన కృష్ణా ఎస్పీగా వచ్చీ రాగానే ఓ చిన్న ఘర్షణకే హుటాహుటిన గుడివాడ వెళ్లి ఓ రోజంతా గడిపారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు బలంగా లేదనే విమర్శలున్నాయి.కాకినాడ పోర్టులో బియ్యం మాయంపై సిట్‌ విచారిస్తోంది. బందరులో బియ్యం మాయం కేసును ఎస్పీ.. సిట్‌కు బదిలీ చేసే వీలున్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. బందరు నుంచి బియ్యం కాకినాడ పోర్టుకే వెళ్లాయంటున్నారు. మొత్తానికి గత ప్రభుత్వంలో వైసీపీ పట్ల స్వామి భక్తి ప్రదర్శించిన అధికారగణం ఇంకా అదే మత్తులో ఉండిపోయిందని, అందుకే పేర్ని నాని ఆటలు యధేచ్చగా సాగుతున్నాయంటున్నారు.

Related News

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Big Stories

×