Hari Hara Veeramallu: వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్ సైన్ చేసిన విషయం తెలిసిందే. అయితే రీ ఎంట్రీ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చేసిన అన్ని సినిమాలు రీమేక్. ఆ సినిమాలు చెప్పుకోవడానికి బాగానే ఉన్నా కూడా సరైన కలెక్షన్లు అయితే రాలేదు. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పట్లో ఉన్న వైసిపి ప్రభుత్వం అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ను అప్పట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టార్గెట్ చేసింది. అతని సినిమా రిలీజ్ అయినప్పుడు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు థియేటర్ దగ్గర కాపలా కాసేవాళ్ళు. దీనిపై అప్పటి ప్రభుత్వం పైన తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి. అప్పట్లో టిక్కెట్ రేట్లు చాలా తక్కువగా ఉండేవి. అయితే అన్ని రీమేక్ సినిమాలు మినహాయిస్తే పవన్ కళ్యాణ్ స్ట్రైట్ ఫిలిం హరిహర వీరమల్లు.
భారీ అంచనాల గ్లిమ్స్
ఈ సినిమాకి సంబంధించి మొదట పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా అప్పట్లో ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ సినిమా మీద విపరీతమైన అంచనాలను పెంచింది. పవన్ కళ్యాణ్ చేస్తున్న మొదట పాన్ ఇండియా సినిమా కావడంతో చాలామంది అభిమానులకు విపరీతమైన క్యూరియాసిటీ ఉండేది. అయితే ఈ సినిమా ముందు విడుదలవుతుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైపోయాయి. ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా ఇప్పుడు జూన్ 12న విడుదలకు సిద్ధంగా ఉంది. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఉండే వైబ్ ఈ సినిమాకి లేదు అని చెప్పాలి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే నెలరోజులు ముందు నుంచే ఒక హడావిడి మొదలయ్యేది. కానీ ఈ సినిమా విషయంలో చాలా కూల్ గా జరుగుతుంది.
అన్ఎక్స్పెక్టెడ్ అనుదీప్
అనుదీప్ కె.వి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పిట్టగోడ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అనుదీప్. జాతి రత్నాలు సినిమాతో అద్భుతమైన పేరు సంపాదించుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ కి ముందు నుంచే అనుదీప్ బాగా పాపులర్ అయిపోయాడు. అనుదీప్ కొన్ని ఇంటర్వ్యూస్ లో మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఈటీవీలో వచ్చిన క్యాష్ షో అను దీప్ ను బాగా పాపులర్ చేసింది. ఇక అనుదీప్ మ్యాడ్ సినిమాలో నటించినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా హరిహర వీరమల్లు సినిమాలో కూడా అనుదీప్ నటించాడు. ఈ సినిమా నుంచి తార తార అనే ఒక పాటను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పాటలో ఒక సందర్భంలో అనుదీప్ టక్కును మెరిశాడు. అనుదీప్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాడా లేకుంటే తన కోసం ప్రత్యేకంగా ఏమైనా సీన్స్ డిజైన్ చేశారా వేచి చూడాలి.