Jitesh Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా… మంగళవారం రోజున లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బిగ్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో లక్నోపై 6 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎంతో అద్భుతంగా జితేష్ శర్మ బ్యాటింగ్ చేయడంతో… లక్నో జట్టును ఓడించగలిగింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఈ దెబ్బకు క్వాలిఫైయర్ వన్ లోకి దూసుకు వెళ్ళింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.
Also Read: Kohli – Anushka: గ్రౌండ్ లోనే రొ**మాన్స్.. కోహ్లీకి ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తూ అనుష్క రచ్చ
లక్నో పై పగ తీర్చుకున్న జితేష్ శర్మ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో మధ్య గత రెండు సంవత్సరాల కిందట కూడా మ్యాచ్ జరిగింది. అప్పుడు చిన్నస్వామి స్టేడియం వేదికగా రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో మ్యాచ్ గెలిచిన తర్వాత…. లక్నో బౌలర్ ఆవేష్ ఖాన్ రచ్చ చేశాడు. చివర్లో బ్యాటింగ్ కు వచ్చి… బెంగళూరుకు షాక్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ గెలిచిన తర్వాత తన హెల్మెట్ తీసి… నేలకు బద్దలు కొట్టాడు. అలా చేసినందుకు అప్పట్లో అతనిపై చర్యలు కూడా తీసుకున్నారు. అయితే ఈ సంఘటనను… రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు మాత్రం మర్చిపోలేదు. ఇప్పుడు జీతేష్ శర్మ.. వాళ్ల గడ్డపైన… లక్నో ను ఓడించి అదే తరహాలో… సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. భారీ సిక్సర్ కొట్టి రాయల్ చాలెంజర్స్ జట్టును.. గెలిపించిన జితేష్ శర్మ… తన హెల్మెట్ తీసి నేలకు కొట్టబోయాడు. కానీ ఆవేష్ ఖాన్ తరహాలో రెచ్చిపోలేదు. అదే తరహాలో సెలబ్రేషన్స్ చేసుకొని… బెంగళూరు అభిమానుల కోపాన్ని చెల్లార్చాడు. రెండు సంవత్సరాల పగ తీర్చుకుని… లక్నో జట్టుకు షాక్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటో అలాగే వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఓకే మ్యాచ్ లో మూడు రికార్డులు బద్దలు
లగ్న సూపర్ జెంట్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మంగళవారం మ్యాచ్లో… రాయల్ చాలెంజెస్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సృష్టించాడు. ఒకటి కాదు ఒకే మ్యాచ్లో మూడు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు విరాట్ కోహ్లీ. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున.. మొత్తం 9000 పరుగులు చేసే రికార్డు సృష్టించాడు . అలాగే 500 కు పైగా వరుసగా ఎక్కువ సీజన్లో పరుగులు చేసిన ప్లేయర్గా… రికార్డు క్రియేట్ చేశాడు. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు.. ఎక్కువ హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్ గా కూడా చరిత్ర సృష్టించాడు విరాట్ కోహ్లీ. ఈ టోర్నమంటే ఇప్పటివరకు 63 హాఫ్ చర్యలు చేశాడు.
ALSO READ: Vigilance on HCA : SRH ఓనర్ కావ్య పాప కొంప ముంచిన HCA… బెదిరింపులు చేసి మరి!