BigTV English

Anvesh: నాగార్జున తయారు చేసిన ఉగ్రవాదుల వీరే.. అన్వేష్ మరో బాంబు

Anvesh: నాగార్జున తయారు చేసిన ఉగ్రవాదుల వీరే.. అన్వేష్ మరో బాంబు

Anvesh: పహల్గమ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ప్రజలంతా దీని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అసలు ఇలా ఎందుకు జరిగింది, ఎవరు చేశారు దీని గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ఇదే క్రమంలో యూట్యూబర్ అన్వేష్ కూడా ఈ ఉగ్రదాడిని తన బెట్టింగ్ యాప్స్ వీడియో సిరీస్‌తో కనెక్ట్ చేసి మరొక కొత్త వీడియోను రిలీజ్ చేశాడు. ఈ ఉగ్రదాడికి, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌కు కనెక్ట్ చేసుకుంటూ దీనిని నాగార్జునదే బాధ్యత అంటూ ఈ వీడియోలో తెలిపాడు. నాగార్జునే కొందరు ఉగ్రవాదులను తయారు చేశారంటూ, ఆ ఉగ్రవాదులు ఎవరు, అసలు ఏం చేశారు అంటూ మరొక వీడియోను రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చాడు అన్వేష్.


వీడియోతో బట్టబయలు

బిగ్ బాస్ అనే రియాలిటీ షో తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. ఈ రియాలిటీ షో ప్రారంభం అయ్యిందంటే చాలు.. బుల్లితెర ప్రేక్షకులు చాలామంది దాదాపు మూడు నెలల పాటు మిగతావన్నీ పక్కన పెట్టేసి దీనిని చూస్తుంటారు. కొందరు సెలబ్రిటీలను ఎంపిక చేసి బిగ్ బాస్‌లో కంటెస్టెంట్స్‌గా ఎంపిక చేసి, బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించి, వారి ద్వారా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయిస్తుంటారు. కానీ తెలుగులో బిగ్ బాస్ షోకు మాత్రం ప్రేక్షకులకు ఎవరో తెలియని వ్యక్తులే ఎక్కువమంది వస్తుంటారు. అలా వారు ఆ షో నుండి బయటికి వచ్చేవరకు సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ సీజన్స్‌లో ఏయే కంటెస్టెంట్స్, ఏయే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో క్లియర్‌గా చెప్పేశాడు అన్వేష్.


ప్రూఫ్స్ ఉన్నాయి

బిగ్ బాస్ సీజన్ 8 నుండి విష్ణుప్రియా, అషు రెడ్డి, నైనికా, సీజన్ 2 నుండి దీప్తి సునయన, భాను శ్రీ. సీజన్ 4 నుండి సిరి హన్మంత్, దివి, అలేఖ్య హారిక, సోహైల్. సీజన్ 7 నుండి శోభా శెట్టి, ప్రియాంక జైన్, శుభశ్రీ, నయని పావని, అమర్‌దీప్, తేజస్విని గౌడ, టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్, యావర్, సందీప్. సీజన్ 6 నుండి శ్రీ సత్య. సీజన్ 3 నుండి శివజ్యోతి, శ్రీముఖి. సీజన్ 5 నుండి షణ్ముఖ్ జశ్వంత్, ఆర్జే సూర్య.. ఈ లిస్ట్‌లో ఉన్నవాళ్లంతా పలు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడాన్ని ప్రూఫ్స్‌తో సహా చూపించాడు అన్వేష్. వీరితో పాటు మరెందరో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. ఇలా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వారంతా ఉగ్రవాదులతో సమానమని, దీని బాధ్యత నాగార్జుననే అని అన్నాడు.

Also Read: నాగార్జునపై తీవ్ర ఆరోపణలు చేసిన యూట్యూబర్ అన్వేష్, చిక్కుల్లో పడతాడా.?

నాగార్జునదే బాధ్యత

బెట్టింగ్ యాప్స్ అనేవి ఎంత ప్రమాదకరమని, దానివల్ల ఎవరెవరు ఎలా నష్టపోతున్నారని నా అన్వేష్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాడు. ముఖ్యంగా బిగ్ బాస్‌లో కంటెస్టెంట్స్‌గా వచ్చిన వారంతా ఈ యాప్స్‌ను ఎలా ప్రమోట్ చేశారు, అలా ప్రమోట్ చేయడం వల్ల ఎంత సంపాదించారు అని బట్టబయలు చేశాడు. ఇప్పుడు ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ ఇంత ఫేమ్ రావడానికి నాగార్జున (Nagarjuna)నే కారణమని ఆరోపించాడు అన్వేష్.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×