KCR: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ ప్రసంగిస్తుంటే సభ మధ్యలో కొందరు సీఎం.. సీఎం.. అని అరిచారు. దీంతో కేసీఆర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీళ్లు మనోళ్లేనా..
సీఎం లేదు.. పాడు లేదు.. గమ్మునుండుర్రి వీళ్లు ఇంతకు మనోళ్లేనా.. మీకు ఏం పని లేదా అంటూ కేసీఆర్ ఫైరయ్యారు. ఇలా కార్యకర్తలు రెండు సార్లు అరవడంతో కేసీఆర్ కాస్త ఇబ్బందికి లోనయ్యారు. బీఆర్ఎస్ నాయకులను పిలిచి వీళ్లు ఇంతకు మనోళ్లేనా అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.
సీఎం లేదు.. పాడు లేదు.. గమ్మునుండుర్రి..
ఆ తర్వాత మళ్లీ కేసీఆర్ మాట్లాడడం మొదలు పెట్టారు. ఆ కాసేపటికే.. మరోసారి సీఎం సీఎం అంటూ ముందు వరుసలో ఉన్న కార్యకర్తలు కేకలు వేశారు. సీఎం లేదు పాడు లేదు.. సైలెంట్ ఉండాలని.. సభకు వచ్చిన జనాలకు తాను మాట్లాడేది వినిపించాలని కేసీఆర్ ఫైరయ్యారు.. ఆ తర్వాత ఎవరూ సీఎం అని కేకలు వేయలేదు.. కానీ కేసీఆర్ ప్రసంగిస్తుంటే బిగ్గరగా అరవడం మొదలుపెట్టారు. దీంతో ఆయన ఇక్కడున్న ఆ పది మంది మనోళ్లేనా అంటూ నాయకులను అడిగారు.
స్పీచ్ అయిపోయాక స్టేజీపై డ్యాన్స్ వేద్దాం..
కార్యకర్తలు కాస్త ప్రశాంతంగా ఉండాలని.. పొద్దుటి నుంచి తన కోసం.. తన ప్రసంగం కోసం టీవీల్లో, సభలో చాలా మంది వెయిట్ చేస్తున్నారని.. ప్రసంగం మధ్యలో డిస్టర్బ్ చేయొద్దని వారికి సూచించారు. ప్రసంగం ముగిసిన తర్వాత అందరం కలిసి స్టేజీపై డ్యాన్స్ వేద్దామని కేసీఆర్ నవ్వుతూ మాట్లాడారు. ఇలా కేసీఆర్ బహిరంగ సభల్లో మధ్య మధ్యలో వీళ్లు మనోళ్లేనా, ఏంది వీళ్ల లొల్లి, ఏ గమ్మునుండా వ్యా.. అని మాట్లాడడం మూమూలే.
ఇప్పుడు వేయండిక కేకలు..
చివరగా కేసీఆర్ తన స్పీచ్ ముగిస్తూ.. ఇక ఇప్పుడు కేకలు వేయండి.. బిగ్గరగా అరవండి.. అని వ్యాఖ్యానించడంతో అక్కడి కార్యకర్తలు జైకేసీఆర్ అంటూ ఒక్కసారిగా నినాదాలు చేశారు.
Also Read: KCR Speech: మళ్లోచ్చేది బరాబర్ నేనే చూసుకోండ్రి.. కేసీఆర్ ఊరమాస్ స్పీచ్..