BigTV English

Pawan Kalyan: చిరు పుట్టినరోజు.. పవన్ ఏంటీ.. అలాంటి ఫోటో షేర్ చేశాడు

Pawan Kalyan: చిరు పుట్టినరోజు.. పవన్ ఏంటీ.. అలాంటి ఫోటో షేర్ చేశాడు

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. పదేళ్ల కష్టం తరువాత ఈ ఏడాది పదవిలోకి వచ్చిన పవన్ ప్రస్తుతం జనాల సమస్యలను పరిష్కరించే పనిలో పడ్డారు. ఇక త్వరలోనే పవన్.. మళ్లీ సెట్ పై కనిపించనున్నారు. ఆయన వదిలేసిన మూడు సినిమాలు.. ఆయనకోసం ఎదురుచూస్తున్నాయి. త్వరలోనే  వాటిని పూర్తిచేయడానికి టైమ్ కేటాయించనున్నారు.


ఇక ఇవన్నీ పక్కన పెడితే నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానులతో పాటు ఇండస్ట్రీ మొత్తం చిరుకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. పవన్ సైతం.. అన్నకు స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలిపారు.

” నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి గారు. అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యం బారినపడినవారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయి. కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు. అభ్యర్ధిస్తారు. ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నునిగా చేసిందేమో!


గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో అయిదు కోట్ల రూపాయల విరాళాన్ని జనసేనకు అందచేసి, విజయాన్ని అందుకోవాలని మా ఇలవేలుపు ఆంజనేయుని సాక్షిగా శ్రీ చిరంజీవిగారు ఆశీర్వదించారు. ఆయన ఆ రోజున ఇచ్చిన నైతిక బలం, నైతిక మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయి. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞుణ్ని. తల్లి లాంటి మా వదినమ్మతో ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుణ్ని మనసారా కోరుకుంటున్నాను” అని రాసుకొచ్చారు.

ఇక ఇది కాకుండా.. ఇన్స్టాగ్రామ్ లో పవన్ ఒక అరుదైన ఫోటోను షేర్ చేశారు.  అయితే అది అన్న చిరుతో దిగిందికాదు. సోదరితో కలిసి దిగింది. ” నేను నా సోదరీతో కలిసి బెంగాల్ టైగర్స్ ప్రతిరూపాలతో ఫోజులిచ్చిన ఒక ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకం అని రాసుకొచ్చారు. ఇందులో సోదరి చేతిని పట్టుకొని పవన్ ఎంతో ముద్దుగా కనిపిస్తున్నారు. అన్న పుట్టినరోజున.. ఆయనతో కలిసి ఉన్న ఫోటోను షర్ చేయకుండా.. ఇలాంటి ఫోటో షేర్ చేశాడు  ఏంటి అని కొంతమంది అంటుండగా.. ఇంకొంతమంది మాత్రం సూపర్ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో  నెట్టింట వైరల్ గా మారింది. 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×