BigTV English

Bus fall Into River In Russia: రష్యా.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు, 20 గంటలపాటు

Bus fall Into River In Russia: రష్యా.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు, 20 గంటలపాటు

Bus fall Into River In Russia: రష్యాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మీదగా వేగంగా వస్తున్న బస్సు అదుపు తప్పింది. నేరుగా మోకి నదిలోకి దూసుకెళ్లింది. దాన్ని కంట్రోల్ చేసేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. క్రమంలో పలు వాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. దాదాపు 13 మంది గాయపడ్డారు.


అసలేం జరిగిందంటే.. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ సిటీలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమయం లో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు నీటిలో పడిన ప్రయాణికులను రక్షించేందుకు యత్నించారు. బస్సు నదిలో మునిగి పోవడంతో కొందరు ప్రయాణికులు బస్సు టాప్‌పైకి చేరకున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకుని ప్రయాణికులను ఒడ్డుకు చేర్చాయి. ఘటనకు కారకుడైన డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఘటన వెనుక కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ ప్రైవేటు కంపెనీ ఆధ్వర్యంలో బస్సు నడుస్తోంది. రెస్టు లేకుండా కంటిన్యూ డ్రైవర్ చేత బలవంతంగా 20 గంటల పాటు పని చేయించడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.


ALSO READ: ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్..నయా ట్రెండ్ ఫాలో అవుతున్న యువత

అంతేకాదు ప్రమాదానికి గురైన బస్సుపై 23 సార్లు చలాన్లు పడినట్టు అధికారులు పేర్కొన్నారు. క్రేన్ సాయంలో నదిలోపడిన బస్సును బయటకు తీశారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు అక్కడి అధికారులు.

 

Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×