BigTV English

AR Rahman: చెన్నైలో వరదలు.. ఏఆర్ రెహమాన్ పై విమర్శలు.. ఇంతకీ ఏం చేశారాయన?

AR Rahman: చెన్నైలో వరదలు.. ఏఆర్ రెహమాన్ పై విమర్శలు.. ఇంతకీ ఏం చేశారాయన?

AR Rahman: ఏఆర్ రహమాన్ పాటలు ఎంత బాగుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ ఆయన పాటల్ని ఆస్వాదిస్తారు. జీన్స్, రోజా సినిమాల్లోని పాటలు ఇప్పటికీ సరికొత్త అనుభూతినిస్తాయి. ఏఆర్ రెహమాన్ సంగీత బాణీలు అలా ఉంటాయి మరి. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన హిందీ సినిమా పిప్పా.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. ఇషాన్ ఖట్టర్, మృణాల్ ఠాగూర్, ప్రియాంషు బౌన్సులి, లీసన్ కరిమోవా, సోనీ రుస్తాన్.. తదితరులు ఈ సినిమాలో నటించారు. పిప్పా సినిమాలోని కొన్ని పాటలు కూడా ప్రేక్షకుల ఫేవరెట్ లిస్టులో చేరిపోయాయి.


కాగా.. తాజాగా ఈ సినిమాలో హిట్ టాక్ సొంతం చేసుకున్న మే పర్వానా అనే ఫుల్ వీడియో సాంగ్ ను ఏఆర్ రెహమాన్ రిలీజ్ చేశారు. ఎక్స్ అకౌంట్ ద్వారా మే పర్వానా వీడియో సాంగ్ ను రిలీజ్ చేస్తూ.. ఈ రిథమ్ ను ఎంజాయ్ చేయండి. డాన్స్ చేసేందుకు దీనిని మార్గదర్శకం చేసుకోండి అని ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ నెటిజన్లను ఆగ్రహానికి గురిచేస్తోంది.

మిగ్ జామ్ తుపాను తీరం దాటినా.. చెన్నై నగరం ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. రోడ్లు, ఇళ్లు వరద నీటిలోనే నానుతున్నాయి. వేలాది మంది పునరావాస కేంద్రాల్లో ఆవాసం పొందుతున్నారు. ఇప్పటి వరకూ 17 మంది వరదల కారంగా చనిపోయారు. కరెంట్ లేక, కమ్యూనికేషన్ లేక.. ఆహారం అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. చెన్నై ప్రజలంతా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. అంతపెద్ద మ్యూజీషియన్ ఇలాంటి ట్వీటేనా చేసేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో ఉన్న చెన్నైకి పలువురు హీరోలు డొనేషన్స్ చేస్తుంటే.. ఏఆర్ రెహమాన్ మాత్రం తన సినిమా సాంగ్ ను ఇలా ప్రమోట్ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×