BigTV English

AR Rahman: విడాకులు ప్రకటించి గంటలు కూడా కాలేదు.. అసిస్టెంట్‌తో రెండో పెళ్లికి రెడీ.?

AR Rahman: విడాకులు ప్రకటించి గంటలు కూడా కాలేదు.. అసిస్టెంట్‌తో రెండో పెళ్లికి రెడీ.?

AR Rahman: సినీ పరిశ్రమలో పెళ్లిళ్లు అనేవి జీవితాంతం నిలబడవు అని, కచ్చితంగా ఇండస్ట్రీలో విడాకులు తీసుకునే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుందని చాలామంది ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. అది తప్పు అని ప్రూవ్ చేయడానికి ఇప్పటికీ ఎంతోమంది సినీ సెలబ్రిటీలు తమ మ్యారేజ్ లైఫ్‌లో హ్యాపీగా ఉంటున్నారు. కానీ అనూహ్యంగా పెళ్లయ్యి 10, 20 ఏళ్లు అయిపోయిన తర్వాత సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటూ అందరికీ షాకిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ఏఆర్ రెహమాన్, సైరా భాను చేరారు. 29 ఏళ్లు కలిసున్న తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. కానీ దానికి కారణం రెహమాన్ అసిస్టెంట్ అయ్యిండవచ్చు అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి


అసిస్టెంట్‌తో ఏంటి సంబంధం?

ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వరల్డ్‌లో ఒక సెన్సేషన్. అసలు ఇండియన్ ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీకి ఆస్కార్ వస్తుందా అని అందరూ తక్కువ చేసి మాట్లాడుతున్న సమయంలోనే తన సంగీతంతో ఇండియాకు ఆస్కార్ తీసుకొచ్చాడు రెహమాన్. అందుకే రెహమాన్ పేరు తెలియని ఎంటర్‌టైన్మెంట్ లవర్స్ ఉండరు. తనలాగే మ్యూజిక్ ప్రపంచంలో సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం ఎంతోమంది తన దగ్గర అసిస్టెంట్స్‌గా, మ్యూజీషియన్స్‌గా చేరారు. వారిలో మోహిని డే ఒకరు. మోహిని డే.. రెహమాన్‌కు అసిస్టెంట్‌ స్థానంలో ఉంది. అయితే ఏఆర్ రెహమాన్ విడాకుల వెనుక మోహిని డే హస్తం ఉండవచ్చనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Also Read: సైరా భాను బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. అసలు వీరి పెళ్లి ఎలా జరిగిందంటే..?

అందుకే విడాకులు?

అసలు మోహిని డే (Mohini Dey)కు, ఏఆర్ రెహమాన్ (AR Rahman) విడాకులకు సంబంధం ఏంటంటే.. ఇటీవల తన 29 ఏళ్ల వివాహ బంధాన్ని ముగిస్తున్నట్టు ప్రకటించారు రెహమాన్. అదే సమయంలో తన భర్తతో కూడా తాను విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించింది మోహిని డే. దీంతో ఇద్దరూ ఒకేరోజు తమ వివాహ బంధాన్ని ముగిస్తున్నట్టు ప్రకటించడం ఏంటి అంటూ ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి. వీరిద్దరి మధ్యలో వివాహేతర సంబంధం ఏమైనా ఉందా? అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అని పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు విడాకుల గురించి ప్రకటించినట్టుగానే త్వరలోనే మోహిని డే, రెహమాన్ ఒక్కటి అవుతారు అనే వార్త కూడా రావచ్చమో అని అనుకుంటున్నారు.

గొడవలు తగ్గలేదు

1995లో సైరా భాను, ఏఆర్ రెహమాన్ పెళ్లి చేసుకున్నారు. త్వరలోనే వారి 30 ఏళ్ల వివాహ బంధ వేడుకులు గ్రాండ్‌గా జరుపుకోవాల్సి ఉంది. కానీ.. అనూహ్యంగా వారిద్ద‌రూ విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని సైరా భాను లాయర్ అఫీషియల్‌గా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో దీని గురించి హాట్ టాపిక్ మొదలయ్యింది. గత కొన్నేళ్లుగా రెహమాన్, సైరా భాను మధ్య విభేదాలు మొదలయ్యాయని, వాటిని ఎంత పరిష్కరించుకోవాలని ప్రయత్నించినా అది జరగలేదని, అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నారని లాయర్ తెలిపారు. ఏఆర్ రెహమాన్‌కు ఖతీజా, రహీమాతో పాటు అమీన్ అనే కొడుకు ఉన్నాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×