Ram Charan Controversy : సినీ నటుడు మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటి వరకు లేని విధంగా.. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల దీక్షలో ఉండి దర్గాకు వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రామ్ చరణ్ చేస్తున్న పనుల కారణంగా.. అయ్యప్ప భక్తుల విశ్వాసాలను గౌరవించాలని అంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది.
రెండు రోజుల క్రితం సినీ నటుడు, మెగాహీరో రామ్ చరణ్ తేజ్.. కడపలోని అజ్మీర్ దర్గాను దర్శించారు. అక్కడకు సినీ అభిమానులతో పాటు పెద్ద ఎత్తున మెగా ఫ్యాన్స్ హాజరయ్యారు. దర్గా సంప్రదాయ ప్రకారం.. తలకు రుమాలు కట్టుకుని దర్గాలోకి ప్రవేశించిన రామ్ చరణ్.. అక్కడ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం.. తాను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కి ఇచ్చిన మాట ప్రకారమే దర్గాకు వెళ్లినట్లు తెలిపారు. గతంలో ఓ సారి రెహమాన్ తనను కడపలోని అజ్మీర్ దర్గాను సందర్శించాలని కోరారని.. అందుకే అయ్యప్ప మాలలో ఉండి దర్గాకు వచ్చినట్లు తెలిపారు. తాను గతంలో మగధీర రిలీజ్ సమయంలో దర్గాకు వచ్చినట్లు తెలిపిన రామ్ చరణ్.. అక్కడ బంపర్ హిట్ సాధించినట్లు గుర్తు చేసుకున్నారు.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాతే అసలు వివాదం మెదలైంది. అయ్యప్ప మాలలో ఉండి.. దర్గాకు వెళ్లడాన్ని తప్పు పడుతున్నారు. స్వామి మాలలో ఉన్నప్పుడు అశుభకార్యాలకు దూరంగా ఉండాలనే నిబంధనను మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఎందుకంటే.. దర్గా అంటే ముస్లిం మత వ్యాప్తి కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారి సమాధులు. అలాంటి చోటకి మాలలో ఉండి వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
రామ్ చరణ్ దర్గాకు వెళ్లడం వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్న అయ్యప్ప స్వాములు.. అనాలోచితంగా అలా వెళ్లడం తప్పు అంటున్నారు. కావాలంటే.. మాలలో లేనప్పుడు దర్గాకు వెళ్లొచ్చుగా అని ప్రశ్నించారు. రామ్ చరణ్ చేసిన పని.. టీవీల్లో స్పష్టంగా అందరూ చూశారని చెబుతున్న తెలంగాణా అయ్యప్ప జేఏసీ.. మాలలో ఉండి బొట్టును తొలగించారని ఆరోపిస్తున్నారు. సాధారణంగా.. అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు, ఏదైనా అశుభం జరిగినప్పుడు మాత్రమే నుదుటన ఉన్న విభూతి, గంధం తొలగిస్తారని, అలాంటిది.. ఏమైందని నుదుటన బొట్టు తొలగించారని ప్రశ్నిస్తున్నారు.
ఇతర ధర్మాలను గౌరవించడం హిందూ ధర్మంలోనే ఉందంటున్న తెలంగాణ అయ్యప్ప భక్తులు.. అందుకోసం హిందూ ధర్మ ఆచారాలను తక్కువ చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఓ వైపు రామ్ చరణ్ బాబాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం కోసం పోరాడుతుంటే, రామ్ చరణ్ ఇలా చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. రెహమాన్ కోసం దర్గాకు వెళ్లానని చెబుతున్న రామ్ చరణ్.. అదే ఏఆర్ రెహమాన్ ను హిందూ ఆలయాలకు లేదంటే శబరిమలకు ఇరుముడి కట్టించి గుడికి తీసుకురాగలరా అని ప్రశ్నించారు.
ఈ వివాదంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన రామ్ చరణ్ భార్య కొణిదెల ఉపాసన.. రామ్ చరణ్ కు మద్ధతుగా నిలిచారు. “విశ్వాసం అనేది ఐఖ్యతను కోరుకుంటుంది. విభజనన కాదు. భారతీయులుగా అన్ని ధర్మాలను గౌరవిస్తామని, మన బలం ఐక్యమత్యంలోనే ఉంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన భర్త తన ధర్మాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవిస్తాడు” అంటూ పేర్కొన్నాడు.
Also Read : అఘోరీ నోట భవిష్యవాణి.. చుట్టుముట్టిన భక్తులు.. అసలేం చెబుతోందంటే?
రామ్ చరణ్ వెంట బుచ్చిబాబు సైతం ఉన్నారు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ తర్వాత.. రామ్ చరణ్ బుచ్చిబాబులో సినిమా చేయనున్నాడు. దానికి.. ఏఆర్ రెహ్మన్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం గమనార్హం.