Nara Lokesh: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత మంత్రి నారాలోకేష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రజా సమస్యల గురించి అడిగినా, లేదా ఎవరైనా సాయం చేయాలని కోరినా వెంటనే సమాధానం ఇస్తున్నారు. ఇప్పటికే అనేక సమస్యలను సోషల్ మీడియా ద్వారా పరిష్కరించిన లోకేష్ తాజాగా మరో పోస్టుకు బదులిచ్చారు. సంతోష్ కుమార్ అనే ఓ నెటిజన్ చదువుకు దూరమై, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న ఓ చిన్నారి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Also read: ఇవే వైసీపీ వారసత్వ సంపద.. 150 రోజుల పాలనపై డిప్యూటీ సీఎం పవన్ మాట
వీడియోలో చిన్నారి రోడ్డుపై నిద్రమత్తులో కూర్చుని తూలుతున్నాడు. అతడి ఒంటిపై దెబ్బలు తగిలి ఉండటంతో పాటూ ఆకలితో అలమటిస్తున్నట్టు నెటిజన్ పేర్కొన్నాడు. ఆ చిన్నారి కర్నూలు సిటీలోని డ్రెస్ సర్కిల్ వద్ద ఉన్నాడని ఎలాగైనా కాపాడి, అతడిని ఆదుకోవాలని కోరాడు. తన పోస్టును మంత్రి లోకేష్ కు ట్యాగ్ చేయగా వెంటనే స్పందించాడు. ఈ వీడియో హృదయవిదారకంగా ఉందని విచారం వ్యక్తం చేశారు. ప్రతి చిన్నారికి ప్రేమ, రక్షణ అవసరమని లోకేష్ స్పష్టం చేశారు.
ఆ చిన్నారి ఎక్కడ ఉన్నా చేరదీస్తామని, రక్షిస్తామని తెలిపారు. అతడికి కావాల్సినవన్నీ ఇప్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అంతే కాకుండా చిన్నారిని కొట్టినవారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారికి సాయం చేసేందుకు మరికొందరు సైతం ముందుకు వస్తున్నారు. లోకేష్ వెంటనే స్పందించడంతో ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
This is heartbreaking. Every child deserves safety, love, and dignity. We will locate this child and ensure he receives the protection and care he needs. Those responsible for abusing him will be held accountable. @OfficeofNL https://t.co/hwEEQVTcS4
— Lokesh Nara (@naralokesh) November 20, 2024