AR Rahman – Saira Banu:ఆస్కార్ గ్రహీత ,ప్రముఖ సంగీత దర్శకులు ఏ.ఆర్. రెహమాన్ (AR Rahman) 29 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత విడాకులు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ నేపథ్యంలోనే ఆయన భార్య, పిల్లల గురించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఏ ఆర్ రెహమాన్ భార్య పేరు సైరా భాను (Saira Banu). 1995 మార్చి 12వ తేదీన పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకున్నారు. రెహమాన్ కి పెళ్లికూతురిని చూసే సమయం లేకపోవడం వల్లే, ఆయన తల్లిదండ్రులు వివాహ సెటప్ ని ఏర్పాటు చేశారట. ప్రముఖ నటుడు రషీన్ రెహమాన్(Rasheen Rahman) కి కోడలు అయిన సైరా భానుని రెహమాన్ కి ఇచ్చి వివాహం జరిపించారు.
రెహమాన్ భార్య సైరా భాను ఎవరు..?
ఈ నేపథ్యంలోనే సైరా భాను ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. సైరా భాను గుజరాతీ కుటుంబం నుంచి వచ్చింది. ఉత్తర భారత దేశ సంస్కృతి పై బాగా ప్రావీణ్యం సంపాదించుకుంది. 1973 డిసెంబర్ 20వ తేదీన గుజరాత్ లోని కచ్ లో సాంస్కృతికంగా సంపన్నమైన కుటుంబంలో జన్మించింది. సామాజిక, స్వచ్ఛంద కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే వారట. భారతదేశంలోని ప్రముఖ సంగీత విద్వాంసులలో ఒకరిని వివాహం చేసుకున్నప్పటికీ, ఎప్పుడూ కూడా తన వ్యక్తిగత జీవితాన్ని బయటకు తెలిపేవారు కాదట. ముఖ్యంగా వారి పని ,విజయాలపై దృష్టిని ఆకర్షించడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. పెద్దపెద్ద సమావేశాలకు, బాలీవుడ్ పార్టీలకు కూడా కలిసి వెళ్తారట అంతేకాదు అంబానీ వివాహ వేడుకల్లో కూడా ఈ జంట హాజరయ్యారు. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ సంగీత పర్యటనలలో రెహమాన్ కు ఎంతగానో మద్దతు పలికింది సైరా.. రెహమాన్ కి తోడుగానే కాకుండా ఆయన సృజనాత్మక ప్రాజెక్టులలో కూడా చురుకుగా పాల్గొనేదట. ఇలా దాదాపు అన్ని విషయాలలో తోడుండే సైరా భాను కు రెహమాన్ ఎందుకు విడాకులు ఇచ్చారు అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.
సంగీత కళాకారులుగా మారిన ఖతీజ, అమీన్..
ఇకపోతే ఈ జంటకు ముగ్గురు పిల్లలు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరు అమ్మాయిలు ఖతీజా, రహీమాతో పాటు అబ్బాయి అమీన్ కూడా ఉన్నారు. ఇక ఇందులో ఆమీన్ (Ameen)ఇటీవల ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, సంగీత లోకంలో ప్రయాణం మొదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. తండ్రిలాగే గొప్ప సంగీత దర్శకుడు కావాలని అమీన్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం సంగీత కచేరీలు కూడా ఇస్తూ బిజీగా మారారు అమీన్. ఇక ఖతీజా , రహీమా విషయానికి వస్తే.. పెద్ద కూతురు ఖతీజా (Khatija)తండ్రిలాగే సంగీత దర్శకురాలిగా తనను తాను ప్రూవ్ చేసుకొని.. 2022లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
చెఫ్ గా మారిన చిన్న కూతురు..
చిన్న కూతురు రహీమా (Raheema Rahman)ఒకవైపు కీబోర్డు ప్లేయర్ గా సాధన చేస్తూనే.. మరొకవైపు తనకు నచ్చిన హోటల్ మేనేజ్మెంట్ కోర్సును దుబాయ్ లో పూర్తి చేసింది. ఇక తన క్యాటరింగ్ కోర్సును పూర్తి చేస్తూ.. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా సర్టిఫికెట్ ను కూడా అందుకుంది. ఇక 2024 మే 19వ తేదీన తన చిన్న కూతురు చెఫ్ అయ్యిందంటూ సోషల్ మీడియా వేదికగా రెహమాన్ తెలియజేశారు.