Shalini Pandey:సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తమకంటూ ఒక గుర్తింపు రావాలి అని ఎంతో మంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆడవారు.. ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఇకపోతే అలా ఇబ్బందులు ఎదుర్కొన్న ఎంతోమంది నటీమణులు ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటుంటే.. మరి కొంతమంది మీడియా ముందుకు రావాలంటే కూడా భయపడుతున్నారు. అయితే ఇప్పుడు తాను మాత్రం ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ చెప్పి ఆశ్చర్యపరిచింది అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే (Shalini Pandey).
క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన అర్జున్ రెడ్డి బ్యూటీ..
అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి. అయితే తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్కు వెళ్ళిపోయింది. అక్కడ జీవి ప్రకాష్ (GV Prakash) సరసన హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల ఆదరణ కూడా సొంతం చేసుకుంది. ఇకపోతే తమిళంలో రీమేక్ చేసిన 100% లవ్ మూవీలో తమన్నా భాటియా పాత్రలో చాలా అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. అలా పలు చిత్రాలలో నటించి అలరించిన ఈమె.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన అంద చందాలతో నెటిజన్లను కట్టిపడేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూకి హాజరైన షాలిని పాండే సంచలన కామెంట్లు చేసింది. అలాగే తన కెరియర్లో తాను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆ డైరెక్టర్ నేరుగా రూమ్ లోకి వచ్చారు – షాలిని పాండే..
ఇంటర్వ్యూలో భాగంగా షాలిని మాట్లాడుతూ.. ఒక మూవీ షూటింగ్ సమయంలో క్యారవాన్ లో డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు అనుమతి లేకుండా ఒక డైరెక్టర్ వచ్చి నేరుగా డోరు తీశాడు. ఆ క్షణం చాలా కోపం వచ్చింది. కేకలు కూడా వేశాను. దీంతో ఆదర్శకుడు వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయాడు అంటూ షాలిని తెలిపింది.అయితే అక్కడున్న వారంతా కూడా అలా కోపంగా అరవడం సరైంది కాదని, చుట్టూ ఉన్న వాళ్ళు అలా అనడంతో నాకు కూడా తప్పుగా అనిపించలేదని వెల్లడించింది. ఇక ఆ తర్వాత ఇంకెప్పుడూ కూడా అలాంటి పరిస్థితులు ఎదురు కాలేదని.. ఒకవేళ అలాంటి సిచువేషన్ వచ్చినా.. ఎదుటివారిపై కోపం చూపించకుండా ఎలాంటి సమాధానం చెప్పాలో తెలుసుకున్నాను అంటూ కూడా ఆ ఇంటర్వ్యూలో తెలిపింది షాలిని పాండే. 1993 సెప్టెంబర్ 23న మధ్యప్రదేశ్లోని జబల్పూర్ లో జన్మించింది. అక్కడే ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈమె.. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఉన్నప్పటినుండి నాటకాలలో నటించడం ప్రారంభించింది. ఒక నటనపై ఆసక్తితో నాటకాలలో నటిస్తున్న సమయంలోనే అర్జున్ రెడ్డి అనే తెలుగు చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి ప్రవేశించింది. తెలుగు మాట్లాడడం రాకపోయినా ఆ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. ఆ తర్వాత 100% కాదల్ , మహానటి వంటి చిత్రాలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.