Scorpion Farming : కోళ్లను పెంచుకుంటాం, కుక్కల్ని పెంచుకుంటాం.. కానీ ఒక్క కాటుతో చుక్కలు చూపించే తేళ్లను ఎవరైనా పెంచుకుంటారా.? అస్సలు లేదు. అంతటి సాహసం ఎవరు చేస్తారు అంటారా.. అయితే ఈ వీడియోను చూసేయండి. గదుల్లో కుప్పలు, కుప్పలుగా కనిపిస్తున్నవి తేళ్లు. మామూలు తేళ్లు కూడా కాదండోయ్.. వాటి కోరల నిండా విషం నిండుకున్న తేళ్లు. అసలు వాటికి విషం ఉందనే పెంచుతున్నారు అంటే మీరు మరింత ఆశ్చర్యపోతారేమో.. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో ఫుల్ వైరల్ గా మారిపోయింది.
మీకు తెలుసా.? ఈ తేళ్ల నుంచి తీసే విషానికి అత్యంత విలువ ఉంటుంది. ఎంత అంటారా.. లీటరుకు $10 మిలియన్లు.. అంటే దాదాపు రూ.800 కోట్లకు పైమాటే. వీటికి ఎందుకు అంత విలువ అంటే.. ఈ విషానికి ఎన్నో ఔషధ గుణాలుంటాయి. అందుకే.. దీనిని అనేక సౌందర్య సాధనాలు, మందుల తయారీలో వినియోగిస్తారు. అందుకే.. కొంత మంది డేంజర్ అనుకునే ఈ తేళ్ల పెంపకాన్ని చాలా ఉత్సాహంగా చేస్తున్నారు. ఇక ఈ వీడియోను ఇంటర్నెట్ లో చూసిన నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది.. ఇది అస్సలు ఊహించేలా లేదని కామెంట్లు చేస్తే, మరికొంత మంది ఆదాయం తెలిసిన తర్వాత తమకు తేళ్లను పెంచాలని ఉందంటూ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ.. తెలుసుగా, అనుభవం లేకుండా తేలును పట్టుకొచ్చారో.. మీకు తేలు కాటు తప్పదు అంటూ ఇంకొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఒక వీడియో నిజమైనదే అని తెలుస్తోంది. కొందరు ఈ ఫుటేజ్ చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉందని అంటుంటే, మరికొందరు మాత్రం పూర్తిగా భయంకరంగా ఉందంటూ హడలిపోతున్నారు. మీకు ఎలా అనిపించిందో.. మీరూ ఓ కామెంట్ చేసేయండి.
ఈ విషాన్ని ఎందుకు వినియోగిస్తారు
ఎక్స్ లో పోస్టు చేసిన ఈ వీడియోలో.. ప్రతి తేలు రోజుకు దాదాపు 2 మిల్లీగ్రాముల విషాన్ని ఉత్పత్తి చేస్తుందని వెల్లడించింది. ఈ విషాన్ని జాగ్రత్తగా సేకరిస్తే.. ఒక లీటరు $10 మిలియన్ల అమ్ముకోవచ్చని అంటున్నారు. దీనిని అనేక ప్రాచీన వైద్య విధానాల్లో వినియోగిస్తుంటారు. ఇటీవల, కొన్ని ఆధునిక వైద్య పరిశోధనలలో తేలు విషంలోని రసాయనాలను వాడి ఆర్థరైటిస్, న్యూరాల్జియా (నరాలు సంబంధించి నొప్పులు), క్యాన్సర్ చికిత్స కోసం పరిశోధనలు చేస్తున్నాయి. కొన్ని విషపు పదార్థాలు, అందులో స్కార్పియో విషం కూడా, నొప్పిని తగ్గించడానికి లేదా క్యాన్సర్ కణాల పెరుగుదలపై ప్రభావం చూపడాన్ని కనుక్కున్నారు. స్కార్పియో విషంలో ఉన్న జీరోటాక్సిన్ అనే రసాయనం కొన్ని నరాల సంబంధిత వ్యాధులపై ప్రభావం చూపిస్తుందని తేలింది.
Did you know?
Scorpions farms do exist.
Each scorpion produces about 2 milligrams of venom daily, which is milked using a pair of tweezers and tongs. A liter is worth $10 million, used for cosmetics and medicinespic.twitter.com/Spfierr58i
— Massimo (@Rainmaker1973) March 20, 2025
Also Read : Viral Video: విడాకుల కోసం కోర్టుకెక్కిన భార్య.. పాటపాడి మనసు కరిగించిన భర్త!
ఈ ఫుటేజ్ లో గోడలన్నీ తేళ్లతో నిండిపోయి కనిపిస్తుంది. తేళ్లును పెంచే ఫామ్ లు కూడా నిజంగా ఉన్నాయా అంటూ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. పోస్ట్ చేసినప్పటి నుంచి ఈ వీడియో వైరల్ అయ్యిందియ. నెటిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో లైక్‌లు, వ్యూస్, కామెంట్లు వస్తున్నాయి. కాగా.. ఓ యూజర్ అయితే.. ఈ వీడియో చూసిన తర్వాత ప్రకృతి సంక్లిష్టత నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తోంది. అతి చిన్న జీవులు కూడా వైద్యశాస్త్రానికి ఇంత విలువైన సహకారాన్ని ఎలా అందించగలవో చూడటం ఆసక్తికరంగా ఉంది అంటూ సరికొత్తగా కామెంట్ చేశారు.