Arshad Warsi : బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ (Arshad Warsi)పలు హిందీ సినిమాలలో నటించి నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ప్రేమకా బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ దగ్గర ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు అనంతరం నటుడిగా సినిమా అవకాశాలను అందుకుంటూ బాలీవుడ్ సినిమాలలో కొనసాగుతూ వచ్చారు..అర్షద్ “తేరే మేరే సప్నే” అనే సినిమా ద్వారా ఈయన హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు తన మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ విధంగా ఎన్నో అద్భుతమైన కామెడీ సినిమాలలో కూడా నటించి మంచి సక్సెస్ అందుకున్న అర్షద్ తన నటనకు గాను ఏకంగా ఐదు ఫిలింఫేర్ అవార్డులను కూడా అందుకున్నారని తెలుస్తోంది. ఇలా పలు సినిమాలలో నటుడిగా కొనసాగుతున్న అర్షద్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు.
తప్పుడు సమాచారం…
నటుడు అర్షద్ వార్సీ ఆయన భార్య మరియా గోరెట్టి (Maria Goretti)పై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) (Sebi)సస్పెన్షన్ వేటు వేసింది. వీరిద్దరూ సెబి గురించి యూట్యూబ్ ఛానల్ లో తప్పుడు సమాచారాలను ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో వీరిపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.సాధన బ్రాడ్‌కాస్ట్ షేర్ కొనుగోళ్లను ప్రోత్సహిస్తూ యూ ట్యూబ్ ద్వారా తప్పుడు సమాచారాన్ని చేరవేశారని తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని సెబీ తెలియజేయడమే కాకుండా అర్షద్ మరియు తన భార్యపై ఏకంగా ఐదు లక్షల రూపాయల జరిమానా విధించారు. అదేవిధంగా ఒక ఏడాది పాటు సెక్యూరిటీల మార్కెట్ నిషేధాన్ని కూడా విధించింది.
లక్షల్లో లాభాలు…
సెబి తెలియజేసిన సమాచారం ప్రకారం అర్షద్ ఈ విధమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడుతూ ఏకంగా రూ.41.70 లక్షల ఆదాయాన్ని పొందినట్టు తెలుస్తుంది. అదేవిధంగా తన భార్య ఈ కార్యకలాపాలలో భాగంగా రూ.50.35 లక్షలు లాభం పొందినట్టు సెబి తెలిపింది. అలాగే ఈ వ్యవహారంలో SBL , RTA డైరెక్టర్ సుభాష్ అగర్వాల్, మనీష్ మిశ్రా ప్రమోటర్ల మధ్య మధ్యవర్తిగా వ్యవహరించారని, అయితే పక్కా పథకం ప్రకారమే ఈ ప్రణాళికను అమలు చేసినట్లు ఈ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
ఈ విధంగా సెబి గురించి తప్పుడు సమాచారాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తూ నటుడు అర్షద్ తన భార్య భారీ లాభాలను అందుకొని మోసాలకు పాల్పడటంతో వీరిపై అనర్హత వేటు వేసింది . ప్రస్తుతం ఈ విషయం కాస్త బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సంచలనగా మారింది. అయితే ప్రస్తుతం ఈ వ్యవహారంపై సెబీ పూర్తిస్థాయిలో విచారణ జరుపుతుందని తెలుస్తుంది. అయితే ఈ సమస్యకు పూర్తి పరిష్కారం దొరికే వరకు అదనంగా 12 శాతం వార్షిక వడ్డీతో అక్రమ లాభాలను తిరిగి చెల్లించాలని ఈ కుట్రలో భాగమైన 59 సంస్థలకు ఆదేశాలను కూడా జారీ చేసింది.