Tamannaah Bhatia : ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎప్పుడు ఎలా సడన్ ట్విస్ట్ ఇస్తారో చెప్పలేని పరిస్థితి. గతంలో హీరోయిన్ శ్రియ (Shriya Saran) ఏకంగా బిడ్డను చేతిలో పెట్టుకొని పెళ్లయింది. బిడ్డ కూడా పుట్టిందని చెప్పి షాక్ ఇచ్చింది. ఇక మొన్నటికి మొన్న ఇలియానా (Ileana D’Cruz) పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నానని చెప్పి అభిమానులను హర్ట్ చేసింది. ఇక కొడుకు పుట్టడమే కాదు ఇప్పుడు రెండో ప్రెగ్నెన్సీ ని కూడా ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు మిల్కీ బ్యూటీ కూడా సడన్ గా పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది అంటూ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న ఒక వీడియో అందరిని ఆశ్చర్యపరిచింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో తమన్నా ని చూసిన నెటిజన్స్.. హవ్వా ..పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నావా? అంటూ ఆశ్చర్యంతో నోరెళ్ళబెడుతున్నారు. మరి అసలు ఏం జరిగిందో.. ఇప్పుడు చూద్దాం.
వరుస సినిమాలతో భారీ బిజీ..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న తమన్నా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. తెలుగులో ‘శ్రీ’ అనే సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి, ‘హ్యాపీడేస్’ సినిమాతో మంచి క్రేజ్ అందుకుంది. ఇక ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఈమె తెలుగు, తమిళ్, హిందీలోనే కాదు మలయాళం లో కూడా అవకాశాలు అందుకుంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. గత 17 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను కొనసాగిస్తున్న ఈమె ఇప్పుడు కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేసరికి, ఈమె హవా కాస్త తగ్గించిందని చెప్పాలి. అయినా ఏం పర్లేదు అంటూ స్పెషల్ సాంగ్ లలో స్టార్ హీరోయిన్ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఆశ్చర్యపరుస్తోంది. ఇకపోతే గత ఏడాది వరుసగా నాలుగు సినిమాలలో నటించి మంచి హిట్స్ తన ఖాతాలో వేసుకున్న ఈమె ఇటీవల ఓదెల- 2 సినిమాతో పలకరించింది. ఇక మరొకవైపు బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ తో అలరిస్తున్న విషయం తెలిసిందే
తల్లి కాబోతున్న తమన్నా.. వీడియో వైరల్
ఇక తమన్నా వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. తమన్నా వ్యక్తిగత జీవితం కూడా తెరిచిన పుస్తకమే అని చెప్పాలి. ప్రముఖ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న ఈమె ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు తన బాయ్ ఫ్రెండ్ తో వెకేషన్స్ కి వెళ్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. ఇదిలా ఉండగా సడన్గా వీరిద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు రావడంతో ఇటీవల బ్రేకప్ చెప్పుకొని విడిపోయినట్టు వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత ఒకే చోట కనిపించి క్లారిటీ ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా తమన్నా ఒక వీడియోలో చాలా బొద్దుగా కనిపించింది. ఫ్రంట్ బొజ్జ, బ్యాక్ తో లావుగా కనిపించడంతో ఇది చూసిన నెటిజన్స్ ప్రెగ్నెంట్ అయింది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఇదేం లుక్కు రా నాయనా ఇలా మారిపోయింది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అసలు ఇది తమన్నా లేక ఏఐ క్రియేట్ చేశారా అంటూ కూడా ఇలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఒక్క వీడియో తమన్నాపై పూర్తిస్థాయిలో నెగెటివిటీ పెరిగేలా చేసిందని చెప్పవచ్చు. మరి దీనిపై తమన్న స్పందిస్తుందేమో చూడాలి.
ALSO READ:Manchu Manoj: పాపం.. తండ్రిని వదిల్లేకపోతున్నాడు… ఇది చూసైనా… ‘మంచు’ మనసు కరిగేనా..?
?utm_source=ig_web_copy_link