BigTV English
Advertisement

Viral Video : ఓవర్ యాక్షన్ చేస్తే ఇంతే.. అలల్లో చిక్కుకున్న స్కార్పియో, ఎక్కడో కాదు ఏపీలోనే!

Viral Video : ఓవర్ యాక్షన్ చేస్తే ఇంతే.. అలల్లో చిక్కుకున్న స్కార్పియో, ఎక్కడో కాదు ఏపీలోనే!

Viral Video : పెళ్లిళ్ల స్టైలే మారిపోయింది. అసలు తంతు కంటే.. కొసరు వేడుకలకు ప్రయారిటీ బాగా పెరిగిపోయింది. మ్యారేజ్‌కు ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడం ఫుల్ పాపులర్. అలానే ఓ జంట మంచి లొకేషన్ కోసం వైజాగ్ బీచ్‌కు వెళ్లింది. షూట్ అంటే ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్స్ ఓవరాక్షన్ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలుసుగా. క్రియేటివిటీ పేరుతో వాళ్ల బిల్డప్‌లు మామూలుగా ఉండవు. రకరకాల ఫోజులు పెట్టిస్తారు. చీర కొంగులు గాల్లో ఎగరేస్తారు. గౌనులు వేయించి గిరగిరా తిప్పుతారు. హగ్స్ ఇప్పిస్తారు. కిస్సింగ్స్ చేయిస్తారు. పెళ్లికి ముందే వాళ్లిద్దరితో హనీమూన్ సీన్స్ అన్నీ చేయిస్తారు. అలానే ఆ కపుల్స్‌తో కూడా బీచ్‌లో రిచ్ ఆల్బమ్ తీయాలని ప్లాన్ చేశారు. అది కాస్తా బెడిసికొట్టింది. కారు ఇసుకలో ఇరుక్కుపోయింది.


బీచ్‌లో స్కార్పియో.. సీన్ సితార్..

ఓ స్కార్పియో వెహికిల్ బీచ్‌లో దూసుకుపోతుంది. అలలను చీల్చుకుంటూ.. సముద్రం నీటిని చిమ్ముకుంటూ.. సినిమాటిక్‌గా బండి రయ్ రయ్ మంటుంది. సడెన్ బ్రేక్‌తో గిర్రున తిరిగి ఆగుతోంది. డోర్లు ఓపెన్ అవుతాయి. అందులోంచి పెళ్లికొడుకు, పెళ్లికూతురు దిగుతారు. అలలతో కాసేపు ఆడుకుంటారు. ఇసుకలో లవ్ సింబల్ గీస్తారు. తమ పేర్లు రాస్తారు. ఇదీ సీన్. అలా తీయాలని ప్లాన్ చేశారు. రెడీ.. ఓకే.. కెమెరా.. స్టార్ట్.. అనగానే స్కార్పియో రయ్యున స్టార్ట్ అయింది. అంతలోనే లటుక్కున ఇసుకలో ఇరుక్కుపోయింది.


ఇసుకలో ఇరుక్కుపోయిన స్కార్పియో..

అవును, అనుకున్నది ఒక్కటి.. అక్కడ జరిగింది మరోటి. స్కార్పియో బండి బీచ్‌లో కూరుకుపోయింది. ఇసుకలో దిగబడింది. ఎంత రేస్ చేసినా ముందుకు కదల్లేదు. మరింతగా గోతిలోకి పోతోంది. గేర్లు మార్చినా లాభం లేదు. డ్రైవర్ ఎంత ట్రై చేసినా.. స్కార్పియో ముందుకు కదల్లేదు. అలలు వస్తున్నాయి. మరింత ఇసుక మేట వేస్తోంది. టైర్లు లోలోపలికి దిగబడుతున్నాయి. ఏం చేయాలో వాళ్లకు తెలీకుండా పోయింది. ఇదంతా పక్కనే ఉన్న మత్స్యకారులు చూశారు. పాపం అని సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

Also Read : పులితో రీల్స్.. దెబ్బకు మైండ్‌బ్లాక్.. వైరల్ వీడియో..

ఎలా బయటకు తీశారంటే..

విశాఖ, జోదుగుల్లపాలెంలో జరిగిందీ ఉదంతం. సుమారు 20 మంది లోకల్ పీపుల్.. ఇసుకలో ఇరుక్కున్న స్కార్పియోను బయటకు తీసే ప్రయత్నం చేశారు. ముందుగా అంతా కలిసి వెనక నుంచి తోశారు. కానీ, బండి కదల్లేదు. కొందరు టైర్ల చుట్టూ ఉన్న ఇసుకను తోడేశారు. అయినా కదల్లేదు. ఆ తర్వాత పక్కనుండి కొన్ని కర్రలు, చెక్కలు తీసుకొచ్చారు. టైర్ల కింద వాటిని జాగ్రత్తగా అమర్చి.. చక్రం వాటి మీదకు ఎక్కేలా అడ్జస్ట్ చేశారు. అప్పుడు కారు రైజ్ చేస్తే.. ఆ కర్రలు, చెక్కల మీదుగా టైర్లు బయటకు వచ్చేశాయి. బండి ఇసుక గుంత నుంచి జర్రుమంటూ ముందుకు కదిలింది. అదే స్పీడ్‌తో ఒడ్డుకు సేఫ్‌ ప్లేస్‌కు వచ్చేసింది నల్లటి స్కార్పియో. ఆ వీడియో మూడు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో బీచ్‌‌లో ఓవరాక్షన్ చేస్తే ఇట్టానే ఉంటాది అంటూ నెటిజన్లు కామెంట్లతో కుమ్మేస్తున్నారు.

?utm_source=ig_web_copy_link

Related News

Longest Name: ప్రపంచంలోనే పొడవైన పేరున్న వ్యక్తి ఇతడే.. ఏకంగా గిన్నిస్ రికార్డు కొట్టేశాడు!

Shocking Video: లక్నోలో రెచ్చిపోయిన యువతి.. కారులో నగ్నంగా ప్రయాణం.. వీడియో వైరల్

Viral Video: ఆఫీసులో తింగరి వేషాలేంటి? హీటెక్కిపోయిన బ్యాంక్ మేనేజర్, ఆ తర్వాత ఏం జరిగిందంటే

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

Big Stories

×