BigTV English

Love Me OTT: అదేంటి.. 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Love Me OTT: అదేంటి.. 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Vaishnavi Chaitanya Love Me To Stream On Aha: టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆశీష్. ఇండస్ట్రీకి వచ్చిన మొదటి సినిమాతో సరైన స్టార్డమ్ అందుకోలేకపోయాడు. దీంతో తన తదుపరి సినిమాపై ఫుల్‌గా ఫోకస్ పెట్టాడు. ఇందులో భాగంగానే తన నెక్స్ట్ మూవీని అరుణ్ భీమవరపు దర్శకత్వంలో చేశాడు. అదే ‘లవ్ మి’ మూవీ. ఇందులో ఆశీష్ హీరోగా నటించగా.. ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది.


ఫస్ట్ నుంచి ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. పోస్టర్స్, గ్లింప్స్, ట్రైలర్‌తో ఈ మూవీ మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. దీంతో ఈ మూవీ మంచి హిట్ కొడుతుందని అంతా భావించారు. కానీ మే 25న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేసింది. రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది.

అదీగాక మూవీ రిలీజ్‌కు ముందు పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో జనాల్లోకి వెళ్లలేదు. దీంతో ఈ మూవీ ఫస్ట్ షో నుంచే బాక్సాఫీసు వద్ద బోళ్తా పడింది. అయితే సినిమా కాస్త థ్రిల్లింగ్‌గా ఉన్నప్పటికీ తీసిన విధానం, స్క్రీన్ ప్లే పెద్దగా ప్రభావం చూపలేదు. అందువల్లనే ఈ మూవీ పెద్దగా ఆడలేకపోయింది. దీంతో థియేటర్లలో రిలీజ్ అయిన అతి కొద్ది రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.


Also Read: లవ్ మీ మూవీకి ఊహించని టాక్.. సిల్లీ స్టోరీనా..?

తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘లవ్ మీ’ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. జూన్ 15 లేదా జూన్ 22న ఈ మూవీ ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ జూన్ 15న స్ట్రీమింగ్‌కి వస్తే మాత్రం రిలీజ్ అయిన 20 రోజుల్లోపే వస్తుందని చెప్పుకోవచ్చు.

ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించారు. అలాగే హర్షిత రెడ్డి, హన్సిత, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. అయితే ఈ మూవీ ఫస్ట్ పార్ట్ పెద్దగా ఆడకపోయినా.. సినిమా చివర్లో రెండో పార్ట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు సీక్వెల్‌గా రాబోతున్న చిత్రానికి ‘కిల్ మీ- ఇఫ్ యూ లవ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×