BigTV English

Love Me Movie Twitter Review: లవ్ మీ మూవీకి ఊహించని టాక్.. సిల్లీ స్టోరీనా..?

Love Me Movie Twitter Review: లవ్ మీ మూవీకి ఊహించని టాక్.. సిల్లీ స్టోరీనా..?

Love Me Twitter Review: టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయ్యాడు ఆశీష్. ఇండస్ట్రీకి వచ్చిన తన తొలి సినిమాతో ఆశించిన స్టార్ట్‌ను అందుకోలేకపోయాడు. అయితే ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలని ఇప్పుడు మరొక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ‘లవ్ మీ’ మూవీ. ఎన్నో అంచనాల నడుమ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ట్విట్టర్ రివ్యూల ద్వారా తెలుసుకుందాం.


యంగ్ హీరో ఆశీష్ – వైష్ణవి చైతన్య జంటగా కిరణ్ భీమవరం దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లవ్ మీ’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ సమర్పణలో హర్షిత రెడ్డి, హన్సిత, నాగ మల్లిడి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇందులో రవి కృష్ణ, సిమ్రన్ చౌదరి వంటి నటీ నటులు కీలక పాత్రలు పోషించారు.

కథ


‘లవ్ మీ’ మూవీలో ఓ కుర్రాడు ఏది చెయ్యొద్దో అంటే అదే చేసి దెయ్యం జోలికి వెళ్తాడు. అయితే ఆ తర్వాత ఆ దెయ్యంతో సన్నిహితంగా ఉంటాడు. దానితో ప్రేమలో పడతాడు. అంతేకాకుండా ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ అవుతాడు. అయితే ఆ తర్వాత ఆ దెయ్యానికి ఉండే సమస్యలను తీర్చడం కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఇదీ సినిమా కథ. అయితే ఈ సినిమాను చూసిన ఓ నెటిజన్ తన రివ్యూని సోషల్ మీడియా ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నాడు.

Also Read: ఆమెను ఎవరు రెండుసార్లు చూసింది లేదు.. భయపెడుతున్న లవ్ మీ ట్రైలర్

‘‘లవ్ మీ మూవీ అనేది ఓ సిల్లీ దెయ్యం నేపథ్యంలో వచ్చిన కథ. అయితే ఇది ఆసక్తికరమైన పాయింట్‌లతో వచ్చింది. కానీ దాన్ని చూపించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. థ్రిల్లింగ్ సస్పెన్స్‌లను క్రియేట్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. అంతేకాకుండా స్క్రీన్ ప్లే కొన్ని సార్లు గందరగోళంగా ఉంది.’’ అంటూ రాసుకొచ్చాడు.

దీని ప్రకారం చూస్తే.. లవ్ మీ మూవీ ఫస్ట్ హాఫ్ సెకండాఫ్‌లో కొన్ని సీన్లు మాత్రమే బాగున్నాయి. అయితే సస్పెన్స్‌ను క్రియేట్ చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. అలాగే మ్యూజిక్ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. అని తన అభిప్రాయాన్ని రివ్యూ రూపంలో తెలిపాడు. ఇప్పటి వరకు వచ్చిన ట్వీట్ బట్టి చూస్తే.. ఈ మూవీకి ఇది భారీ దెబ్బే అని చెప్పొచ్చు. మరి ఈ మూవీ టాక్ బట్టి కనీసం వీకెండ్ వరకు అయినా రన్ అవుతుందా? లేదా? అనేది చూడాలి.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×