BigTV English

Love Me Trailer: దెయ్యాన్ని చూస్తే అది చంపేస్తుంది.. చూడకపోతే వీడు చచ్చేలా ఉన్నాడు!

Love Me Trailer: దెయ్యాన్ని చూస్తే అది చంపేస్తుంది.. చూడకపోతే వీడు చచ్చేలా ఉన్నాడు!

Love Me If you Dare Movie Trailer Out Now: దిల్ రాజు వారసుడుగా రౌడీ బాయ్స్ సినిమాతో పరిచమయ్యాడు ఆశిష్. తమ్ముడు కొడుకే అయినా దిల్ రాజు తన సొంత కొడుకు లాంచ్ లా చాలా గ్రాండ్ గానే ప్లాన్ చేశాడు. అతడు హీరోగా నిలబడడం కోసం బాగానే కష్టపడుతున్నాడు. ప్రస్తుతం ఆశిష్ హీరోగా నటిస్తున్న చిత్రం లవ్ మీ.. ఇఫ్ యూ డేర్ అనేది ట్యాగ్ లైన్. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు.


ఇక ఈ సినిమాలో ఆశిష్ సరసన బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తుండగా.. సిమ్రాన్ చౌదరి కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఇప్పుడు మే 25 న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. మరో రెండు రోజుల్లో రిలీజ్ డేట్ ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగాన్నీ పెంచారు.

హీరో హీరోయిన్లు ఒకపక్క ఇంటర్వ్యూలు, షోస్ అంటూ తిరిగేస్తుండగా.. మేకర్స్ మరోపక్క రిలీజ్ ట్రైలర్స్ తో అదరగొడుతున్నారు. తాజాగా లవ్ మీ రిలీజ్ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దెయ్యంతో ప్రేమ అని మొదట లైన్ చెప్పినప్పుడు అందరూ నవ్వారు. కానీ, ఈ ట్రైలర్ లో నవ్వుతో పాటు భయపెట్టారు కూడా. ఎవరు ఏ పని చేయొద్దు అంటారూ ఆ పని చేసే రకం అర్జున్. దివ్యవతి అనే దెయ్యం తనను చూసిన ప్రతి మగాడ్ని చంపేస్తుంది అంట అనే మాట విన్న అర్జున్.. అది నిజమో కాదో అని ఆ బంగ్లాకు వెళ్తాడు. అలా, ఆమెతోనే ప్రేమలో పడతాడు.


Also Read: Manamey: శర్వానంద్ ‘మనమే’ మూవీ.. సాయంత్రం 5 గంటలకు రెడీగా ఉండండి..

దెయ్యం చంపడానికి వస్తున్న భయం లేకుండా ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దెయ్యాన్ని ఒక్కసారి చూస్తే రెండోసారి చూడడానికి ఎవరు మిగలరు. కానీ, ఆ దెయ్యాన్ని చూడకుండా చావను అని అర్జున్ శపథం చేస్తాడు. అసలు ఈ దెయ్యంతో ప్రేమ ఏంటి .. ? అసలు దివ్యవతి ఎవరు.. ? ఎలా చనిపోయింది.. ? ఎందుకు దెయ్యంగా మారింది. ఇవన్నీ తెలియాలంటే లవ్ మీ చూడాల్సిందే. ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. మరి ఈ సినిమాతో ఆశిష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×