E-Paper
Advertisement

Heroin Asin Divorce : అసిన్ విడాకుల రూమర్స్.. స్పందించిన నటి..

Heroin Asin Divorce  : అసిన్ విడాకుల రూమర్స్.. స్పందించిన నటి..
Advertisement
Heroin Asin

Heroin Asin Divorce : గత కొన్నేళ్లలో ఇండస్ట్రీలోని నటీనటులు పెళ్లిళ్ల సంఖ్య ఎలా పెరుగుతుందో.. వారిలో విడిపోతున్న వారి సంఖ్య కూడా అలాగే పెరుగుతోంది. పెళ్లి చేసుకున్న నటీనటులు ముందుగా విడిపోతున్నారనే విషయం వారిని సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారికి తెలుస్తోంది. ఒకవేళ కొందరు నటీనటులు కావాలని సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోయినా కూడా వారు విడాకులు తీసుకుంటున్నారంటూ రూమర్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లో మరో నటి చేరింది.

Advertisement

కేరళలో పుట్టి ఇతర సినీ పరిశ్రమల్లో మంచి పేరు తెచ్చుకున్న మలయాళ ముద్దుగుమ్మల్లో అసిన్ కూడా ఒకరు. ముందుగా తన మాతృభాష మలయాళంలో హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత తెలుగులో ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ అనే మూవీతో డెబ్యూ చేసింది అసిన్. ఆ తర్వాత తెలుగు, తమిళంలో పలు బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో తను భాగమయ్యింది. సౌత్‌లో తనకున్న క్రేజ్ చూసి బాలీవుడ్ నుండి కూడా తనకు పిలుపు వచ్చింది. సినిమాల్లో బిజీగా గడుపుతోంది అనుకుంటున్న సమయంలో అసిన్ ప్రేమించి పెళ్లి చేసుకుంది.

మైక్రోమ్యాక్స్ కో ఫౌండర్ అయిన రాహుల్ శర్మను అసిన్ 2016లో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాల గురించి తను పూర్తిగా మర్చిపోయి హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్‌ను లీడ్ చేస్తోంది. ఇక తాజాగా అసిన్ విడాకులంటూ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అసిన్.. తన ట్రిప్స్ గురించి, ఫ్యామిలీ లైఫ్ గురించి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ ఉంటుంది. అదే విధంగా తన విడాకులు అంటూ అదే విధంగా తను స్పందించింది.

Advertisement

‘ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ మధ్యలో ఉన్నాం. ఎదురెదురుగా కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న సమయంలో అర్థం లేని వార్త నా కంటపడింది. ఇది చూస్తుంటే.. మా ఇంట్లో కూర్చొని పెళ్లి గురించి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మా బ్రేకప్ అంటూ వచ్చిన రూమర్స్ గుర్తొస్తున్నాయి. కొంచెం బెటర్‌గా ఆలోచించండి. దీనికోసం నా అందమైన హాలిడే నుండి అయిదు నిమిషాలు వేస్ట్ చేసినందుకు ఫీల్ అవుతున్నాను.’ అని అసిన్ పెట్టిన పోస్ట్ ఒక్కసారిగా తన విడాకులపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టేలా చేసింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×