E-Paper
Advertisement

Search Operation For Dog : కుక్క కోసం భారీ సెర్చ్ ఆపరేషన్.. పోలీసులకు సవాల్..

Search Operation For Dog : కుక్క కోసం భారీ సెర్చ్ ఆపరేషన్.. పోలీసులకు సవాల్..
Advertisement
Search Operation For Dog

Search Operation For Dog : ఓ కుక్క కోసం పోలీసులు ఏకంగా 500 ఇళ్లు వెతికారట. అదేంటీ మరీ కుక్క కోసం కూడా ఇంతలా వెతుకాతారా?. అలా అని అదేదో పోలీసు జాగిలమైతే అసలే కాదు. ఆ కుక్క ఓ పోలీస్‌ కమిషనర్‌ పెంపుడు శునకం. ఈ సెర్చ్ ఆపరేషన్ యూపీలోని మీరఠ్‌లో జరిగింది.

Advertisement

ఆ శునకం జర్మన్‌ షెపర్డ్‌ జాతికి చెందినది. దాని పేరు ఎకో. ఆ జాతికి చెందిన కుక్కలు మీరఠ్‌ 19 మాత్రమే ఉన్నాయి. సాయంత్రం 6 గంటలకు శునకం తప్పిపోయిందట. దీంతో పోలీసు సిబ్బంది హుటాహుటిన కమిషనర్‌ నివాసానికి వెళ్లి ఆ ప్రాంతంలోని 500లకు పైగా ఇళ్లు గాలించారని కొన్ని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అంతేకాదు.. జంతువుల సంరక్షణాధికారి హర్పల్ సింగ్‌ సైతం కమిషనర్‌ ఇంటికి చేరుకుని, కుక్క ఫొటోను తీసుకుని వెతికారట.

అయితే ఈ వార్తలను పోలీసు కమిషనర్‌ సెల్వకుమారి ఖండించారు. నా పెంపుడు కుక్క గురించి కొన్ని కథనాలు వస్తున్నాయి. గేట్‌ తెరచి ఉండటంతో అది బయటికి వెళ్లిపోయింది. నివాసానికి సమీపంలోనే అది తిరగడాన్ని గమనించిన కొందరు దాన్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చారని తెలిపారు. అంతేకాని దాన్ని ఎవరూ దొంగిలించలేదని స్పష్టం చేశారు. దాని కోసం పోలీసులు వెతకలేదని కమిషనర్‌ ట్వీట్‌ చేశారు.

Related News

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

Big Stories

Advertisement
×