Meal Schedule Health| చాలా మంది సరైన పోషకాహారం తినాలి, అనారోగ్యకరంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలిని చెబుతుంటారు. తియన్ని పదార్థాలు తినకూడదు, ప్రొటీన్, హెల్తీ ఫ్యాట్స్ బాగా తినాలి అని సలహాలు ఇస్తుంటారు. అయితే ఇవన్నీ ఎప్పుడు తినాలి? ఎప్పుడు తినకూడదు అనేది మాత్రం చెప్పడం మరిచిపోతుంటారు. ఎందుకంటే తినే సమయం కూడా చాలా ముఖ్యం.
పోషకాహార నిపుణుల ప్రకారం.. తప్పుడు సమయంలో తినే ఆహారం మన శరీరంలోని హార్మోన్లు, నిద్ర, బరువు, జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే మన శరీరంలోనే ఒక గడియారం ఉంటుంది. దానికి మనం రోజూ ఏ సమయంలో నిద్రపోతాం, ఏ సమయంలో తింటం అనేది అలవాటు ప్రకారం.. పనిచేస్తుంది. సైన్స్ భాషలో ఆ గడియారం పేరు సర్కేడియన్ రిథమ్ క్లాక్.
భోజనం చాలా లేటుగా చేసినా.. లేక ఒక పూట భోజనం మానేసినా ఈ గడియారం బ్యాలెన్స్ కోల్పోతుంది.
భోజనం వేళకు తినకపోతే ప్రభావింతం అయ్యే హర్మోన్లు ఇవే..
1.ఘ్రెలిన్, లెప్టిన్ (ఆకలి హార్మోన్లు)
మన శరీరంలో ఆకలి, పరిపూర్తణత సంబంధించి ఘ్రెలిన్, లెప్టిన్ అనే హార్మోన్లు ఉంటాయి. ఈ హార్మోన్లే మన మెదడుకు ఆకలి, సంతృప్తి అనే భావాలను తెలియజేస్తాయి. ఒకవేళ లేటుగా భోజనం చేసినా.. లేకపోతే ఆ పూట భోజనం మానేసినా ఆకలి హార్మోన్ అయిన ఘ్రెలిన్ స్థాయి బాగా పెరిగిపోతుంది. అంటే ఎక్కువ ఆకలి కారణంగా ఎక్కువ తినేస్తాం. కానీ సమయానికి తింటే అప్పుడు మితంగా భోజనం చేస్తాం. ముఖ్యంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు లెప్టిన్ అనే సంతృప్తి హార్మోన్ బాగా పనిచేస్తుంది. రాత్రి బాగా ఆలస్యంగా తింటే ఈ హార్మోన్ పనిచేయదు.
2.ఇన్సులిన్.. బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంచుతుంది
మన శరీరంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు షుగర్ ని నియంత్రించే శక్తి బాగా ఉంటుంది. రాత్రి వేళ బాగా హెవీగా భోజనం చేస్తే.. రక్తంలో షుగర్ తీవ్రంగా పెరిగిపోతుంది. ఇలాగే కొనసాగితే డయబెటీస్ (మధుమేహం) వ్యాధి ప్రమాదం ఉంది.
3. కార్టిసోల్.. ఇది స్ట్రెస్ హార్మోన్(ఒత్తిడి)
ఉదయం వేళ కార్టిసోల్ హర్మోన్ పెరిగి.. తిరిగి సాయంత్రం నుంచి తక్కువగా పనిచేస్తుంది. అయితే రాత్రి లేటుగా భోజనం చేసే వారిలో కార్టిసోల్ హార్మోన్ మళ్లీ పెరిగిపోతుంది. అప్పుడు రాత్రి టెన్షన్ కారణంగా నిద్రపట్టదు. శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. ముఖ్యంగా నడుము భాగంలోనే ఫ్యాట్ పేరుకుపోతుంది.
4.మెలటోనిన్.. స్లీప్ హార్మోన్
ఉదయం టిఫిన్ చేయకపోవడం లేదా రాత్రి లేటుగా డిన్నర్ చేయడం చేసే అలవాటు ఉంటే శరీరంలో మెలటోనిన్ హర్మోన్ ప్రభావితం అవుతుంది. ఈ హార్మోన్ వల్లే నిద్ర పడుతుంది. అందుకే సమయానికి తింటే బాగా నిద్ర పోవచ్చు.
వీటికి తోడు రాత్రి వేళ వెజిటేబుల్ సలాడ్ తినకూడదు, పెరుగు, మజ్జిగ తీసుకోకూడదు అని అపోహలున్నాయి. కానీ నిజానికి సలాడ్ లో మంచి ఫైబర్ ఉంటుంది. దాని వల్ల భోజనం బాగా జీర్ణం అవుతుంది. అలాగే రాత్రి వేళ పెరుగు తింటే వల్ల జలుబు, ఆస్తమా వస్తుందనే అపోహలున్నాయి. అయితే ఇందులో నిజం లేదు. పైగా పెరుగులో ట్రిపోటోఫాన్ ఉంటుంది. దీని వల్ల నిద్ర బాగా పడుతుంది.
మీకు నిద్ర సరిగా పట్టడం లేదు.. బరువు పెరిగిపోతున్నారు అనిపిస్తే.. ఇలా చేయండి.
ప్రతి రోజు ఒకే సమయానికి భోజనం చేయండి. ఉదయం, మధ్యాహ్నం మాత్రమే పుష్టిగా భోజనం చేయాలి. రాత్రి వేళ తేలికైన ఆహారం తినాలి. నిద్రపోయే కనీసం రెండు గంటల ముందు భోజనం ముగించాలి. ఉదయం టిఫిన్ తప్పనిసరిగా చేయాలి.
మంచి పోషాకాహారం తినాలి. హోల్ గ్రెయిన్స్, కూరగాయలు, ప్రొటీన్స్ అంటే పప్పు ధాన్యాలు, గుడ్లు, డ్రై ఫ్రూట్స్, నట్స్, చేప లాంటి హెల్తీ ఫ్యాట్స్ ఉండే ఆహారం తీసుకోవాలి.