HBD Abbas:ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు గా పేరు సొంతం చేసుకున్న అబ్బాస్ (Abbas)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, స్టైల్ తో అటు యువతను ఇటు ఆడియన్స్ ను తన వైపు తిప్పుకున్న అబ్బాస్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా స్టార్ హీరోగా ఉన్న అబ్బాస్ టాక్సీ డ్రైవర్ గా ఎలా మారారు..? అసలు ఆ పరిస్థితి రావడం వెనక అసలు కారణం ఏమిటి? ఇప్పుడు మళ్లీ పదేళ్ల తర్వాత రీఎంట్రీకి సిద్ధమయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి? అది ఏ మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్నారు? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం
స్టార్ హీరో నుండి టాక్సీ డ్రైవర్ గా మారిన అబ్బాస్..
ప్రముఖ దర్శకుడు కతిర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమదేశం’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అబ్బాస్. ఈ సినిమాలో మరో హీరో వినీత్ (Vineeth ) కూడా నటించిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా బాలీవుడ్ నటి టబు (Tabu) నటించింది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో.. కాలేజ్ చదువుకునే సమయంలో ఇద్దరు స్నేహితులు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు.. అయితే ఆ అమ్మాయి ఎవరిని ప్రేమిస్తుంది? ఎవరితో ఏడడుగులు వేస్తుంది? అనేది ఊహించని కథాంశంతో ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) అందించిన పాటలు యువతకు పిచ్చెక్కించాయి. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు అత్యధిక వసూలు కాబట్టి రికార్డు సృష్టించింది.ఈ ఒక్క సినిమాతో అబ్బాస్ జీవితం పూర్తిగా మారిపోయింది. ఈ సినిమా తర్వాత వీఐపీ, ప్రియా ఓ ప్రియా, పూ చూడవా, సఖి, నరసింహ, పూవేలి, ఆశైతంబి పంటి చిత్రాలలో నటించారు. ఇక తన అందంతో అమ్మాయిల కలల రాకుమారుడుగా పేరు సొంతం చేసుకున్న ఈయన లవర్ బాయ్గా మారిపోయారు. అలా తమిల్ తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలో సుమారుగా 40 కి పైగా సినిమాలలో నటించిన అబ్బాస్.. ఒకానొక సమయంలో ఆయన నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో సినిమాలు తగ్గిపోయాయి. దీంతో మనోవేదనకు గురైన అబ్బాస్ సినిమాలు వద్దనుకొని తన భార్య పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్లిపోయాడు. అక్కడ ఏం చేయాలో తెలియక కుటుంబాన్ని పోషించుకోవడానికి హోటల్, పెట్రోల్ బంక్ , పంక్చర్ షాపులతో పాటు టాక్సీ డ్రైవర్ గా కూడా పనిచేశాడట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అభిమానులతో చెప్పుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు.
పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న అబ్బాస్..
ఇకపోతే అబ్బాస్ రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వేళ ఆయన శుభవార్త తెలిపారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత పుష్కర్ గాయత్రీ నిర్మాణంలో దర్శకుడు సర్కుణం తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ ‘ఎగ్జామ్’ లో అబ్బాస్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈయనతో పాటు తుషారా విజయన్ అలాగే అదితి బాలన్ కూడా నటిస్తున్నారు .ఇకపోతే ఈరోజు అబ్బాస్ పుట్టినరోజు కాబట్టి ఈ వెబ్ సిరీస్ నుండి ఏదైనా అప్డేట్ వదులుతారా అని అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకా అబ్బాస్ పుట్టినరోజు అని తెలియడంతో అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ALSO READ:Sai Dhansika: విశాల్ కాబోయే భార్యను పొట్టు పొట్టు తిట్టిన హీరో తండ్రి.. స్టేజ్ పైనే ఎమోషనల్..!